Polling started in Narayankhed

Polling started in narayankhed

Poll, Narayankhed, By Polls, Elections, Narayankhed Polls

Voting started in Narayankhed in this morning. All parties took prestigious. Total eight members contesting in this polls

నారాయణఖేడ్ లో పోలింగ్ ప్రారంభం

Posted: 02/13/2016 08:42 AM IST
Polling started in narayankhed

నారాయణ్ ఖేడ్ లో పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో ఖేడ్-లో ఎన్నిక అనివార్యమైంది. దీంతో నేడు జరుగుతున్న పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో ఉండగా సుమారు లక్షా 89 వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని పార్టీలూ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇవాళ్టి పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మొహరించారు. నియోజకవర్గంలో మొత్తం 162 రెవెన్యూ గ్రామాలు ఉండగా 286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం లక్షా 88 వేల 839 మంది ఓటర్లు ఉండగా పురుషులు 95 వేల 772, స్త్రీలు 93 వేల 40మంది ఉన్నారు.

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మహారెడ్డి భూపాల్-రెడ్డి, టీడీపీ నుంచి మహారెడ్డి విజయపాల్-రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండున్నర వేల మంది పోలీసులు పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. లక్షా 88 వేల 236 మంది ఓటర్లకు గానూ దాదాపు అందరికీ పోలింగ్ స్లిప్పులు అందించారు. ఓటర్ ఐడీ కార్డ్ లేకున్నా కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని చూపిస్తే ఓటు వేసేందుకు అనుమతిస్తామని కలెక్టర్ రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రిటర్నింగ్ అధికారి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poll  Narayankhed  By Polls  Elections  Narayankhed Polls  

Other Articles