Kotla Suryaprakash conform that he dont leave congress

Kotla suryaprakash conform that he dont leave congress

Kotla, Kotla Suryaprakash, Kurnool, Congress, Anantapuram Meeting

Ex minister, congress senior leader Kotla Suryaprakash Reddy clear that he ont leave the congress party

కాంగ్రెస్ వదిలిపోనంటున్న కోట్ల సూర్యప్రకాష్

Posted: 02/03/2016 03:56 PM IST
Kotla suryaprakash conform that he dont leave congress

నిన్నటి అనంతపురం జిల్లా బండ్లపల్లి సభలో కోట్ల సూర్యప్రకాష్ కు అవమానం ఎదురైంది. రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్లు పాల్గొన్న ఈ సభ వేదికపైకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి  కోట్ల సూర్యప్రకాష్ ను అనుతించకపోవడంపై కర్నూలులో కోట్ల అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. తనకు జరిగిన అవమానానికి కార్యకర్తలు మనస్థాపం చెందారని కోట్ల సూర్యప్రకాష్ అన్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. పీసీసీ జనరల్ సెక్రటరీ రవిచంద్ర కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో సమావేశం అయ్యారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఈ సమావేశంలో కోట్ల చెప్పారు.

రాహుల్ సభలో వేదికపై పిలిచే క్రమంలో.. కేఎస్ ప్రకాశ్ రెడ్డి అని పేరు రాసి ఉంది. అయితే భద్రతాదళం అడిగినప్పుడు.. ఆయన తన పేరు కోట్ల సూర్యప్రకాశ్ అని చెప్పారు. పేర్లు వేర్వేరుగా ఉన్నాయని భావించిన ఎస్పీజీ.. కోట్లను వెనక్కి పంపేశారు. దీంతో మనస్థాపం చెందిన ఆయన.. 150 వాహనాల్లో వచ్చిన అనుచరులతో కలిసి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి వెళ్లిపోయారు. వేదికపై ఉన్నవారు కోట్లతో మాట్లాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఆయన వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు పళ్లం రాజు, బాపిరాజు, కాసు వెంకట కృష్ణా రెడ్డి కర్నూలు వచ్చి కోట్లతో అర్థరాత్రి వరకు చర్చలు జరిపారు. ఇది కావాలని జరిగింది కాదని, అనుకోకుండా జరిగిపోయిందని వివరణ ఇచ్చారు. అలాగే అనంతపురం డీసీసీ నేతలు కూడా కోట్లకు క్షమాపణ చెప్పారు. దీంతో కోట్ల కాస్త శాంతించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kotla  Kotla Suryaprakash  Kurnool  Congress  Anantapuram Meeting  

Other Articles