Fourty five percent polling in GHMC elections

Fourty five percent polling in ghmc elections

GHMC, Poll, GHMC Polls, GHMC Poll percentage

GHMC commissioner Janardhan Reddy said that Fourty five percent polling in GHMC polls.

ITEMVIDEOS: గ్రేటర్ లో 45 శాతం పోలింగ్

Posted: 02/02/2016 07:33 PM IST
Fourty five percent polling in ghmc elections

గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు సజావుగా జరిగాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. స్వల్ప సంఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ జరిగిందని తెలిపారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేసినందుకు హైదరాబాద్ ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతానికి 45 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. రాత్రి వరకు పోలింగ్ శాతంపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. ఎక్కడా రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ జరగలేదని వెల్లడించారు. ఈవీఎం మెషెన్లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని వెల్లడించారు. 8 ఈవీఎం మెషిన్లపై కొందరు సిబ్బందికి అవగాహనలేక బ్యాటరీలు ఆన్ చేసే ఉంచడం వల్ల చార్జీ తగ్గి ఇబ్బందులు ఏర్పడ్డాయని అయితే గంట రెండు గంటల్లోనే ఎన్నికల సిబ్బంది సమస్యను పరిష్కరించారని వివరించారు.

ఎక్కడా బూత్ క్యాప్చరింగ్ గానీ, రిగ్గింగ్ గానీ జరగలేదని తెలిపారు. 4 టెండర్ ఓట్లు మాత్రమే నమోదైనట్టు వెల్లడించారు. వెబ్ కాస్టింగ్‌కి పోలీసు శాఖ నుంచి సహకారం అందిందని వివరించారు. రెండు మూడు సంఘటనలు జరిగినా అవి పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల అవతల జరిగినవేనని తెలిపారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తీవ్ర ప్రయత్నం చేశామని వివరించారు.లైవ్ వెబ్ కాస్టింగ్ వల్ల హింసాత్మక సంఘటనలేవీ జరగలేవన్నారు. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాలా అన్న విషయాన్ని రిటర్నింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  Poll  GHMC Polls  GHMC Poll percentage  

Other Articles