Kapus demand BC status, stage Rail Roko in Tuni

Kapus demand bc status stage rail roko in tuni

Kaapu Nadu, kaapu, Mudragada {admanabham

Kapus demand BC status, stage Rail Roko in Tuni. Kaapu Leader Mudragada padmanabham call for Rail roko, Rastha roko in Tuni.

ITEMVIDEOS: తీవ్రమైన కాపుల ఉద్యమం.. తునిలో ఉద్రిక్తత

Posted: 01/31/2016 05:36 PM IST
Kapus demand bc status stage rail roko in tuni

కాపునాడు పేరుతో కాపులు చేసిన సభ ఒక్కసారి ఉద్యమ రూపాన్ని దాల్చింది. తమకు రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. కాగా ముద్రగడ పిలుపుతో లక్షల మంది కాపు వర్గీయులు రోడ్లు, రైల్వేలను అడ్డుకుంటున్నారు. దాంతో తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్ సమీపంలో కాపు గర్జన కార్యకర్తలు ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రైలు ఇంజిన్ ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో నలుగురు రైల్వే సిబ్బందికి గాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడితో రైల్వే సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కోల్ కతా-చెన్నై జాతీయ రహదారిపైకి కాపు గర్జన కార్యకర్తలు, ప్రజలు భారీగా చేరుకోవడంతో ఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఈ జాతి ఎంతో నష్టపోతోందని.. ఈ ఉద్యమాన్ని ఆపవద్దంటూ తన కెంతో మంది ఫోన్లు చేస్తున్నారని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యల ద్వారా అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోను అమలు చేయాలని, కాపులను బీసీల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలంలో కాపు, బలిజ, తెలగ కులస్తులు రిజర్వేషన్లు అనుభవించారని అన్నారు.

విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో నంబరు 30 అమలు కాలేదన్నారు. చంద్రబాబు మాత్రం దీనిపై హైకోర్టులో పిటిషన్ వేయించి రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నారని, దీనివల్ల ఆ జీవో అమల్లోకి రాకుండా పోయిందని ముద్రగడ మండిపడ్డారు. కాపులకు ఎంతో చేశామని చంద్రబాబు నాయుడు చెబుతున్నాడని.. మరి, కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయలేకపోతున్నారని, కోర్టులో పిటిషన్ వేసి ఎందుకు అడ్డుకున్నారని తాను ప్రశ్నిస్తున్నానన్నారు. కాపుల రిజర్వేషన్ కోసం ఏమి చేశావంటూ బాబు తనను ప్రశ్నిస్తున్నారని.. తాను ఎమ్మెల్యేగా ఉండి కూడా ఉద్యమం చేశానని అన్నారు. అటో ఇటో తేల్చుకుందామని.. జీవో నంబరు 30 వచ్చే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని ముద్రగడ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaapu Nadu  kaapu  Mudragada {admanabham  

Other Articles