AP Govt must provide reservations to kaapu

Ap govt must provide reservations to kaapu

Kaapu, Mudragada Padmanabham, Kaapu reservations

Mudragada padmanabham call for strike till get reservations for kaapus. In Tuni he called for rail roko and rastha roko

కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే

Posted: 01/31/2016 06:46 PM IST
Ap govt must provide reservations to kaapu

కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్న కాపులు తుని రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేపట్టారు. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో కాపు ఐక్యగర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ డిమాండ్‌ నెరవేర్చే వరకు రైల్‌రోకో, రాస్తారోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆందోళనకారులు తుని రైల్వేస్టేషన్‌కు చేరుకుని.. ఆ సమయంలో అక్కడే ఆగివున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ముట్టడించారు.

ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఓ బోగీకి నిప్పు పెట్టారు. మంటలు వేగంగా వ్యాపించడంతో పలు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై కిందికి దిగిపోయారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు వచ్చిన నలుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాధ్యం కాలేదు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటీన ఇతర ప్రాంతాల నుంచి బలగాలను రప్పిస్తున్నారు.

తాము రెండు డిమాండ్లు కోరడం జరుగుతోందని, కాపు కార్పొరేషన్ నిధులు కేటాయించాలని..రిజర్వేషన్ల జీవో జారీ చేయాలని ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సభ నుండి పోరాడం కాదని..రైలు పట్టాలు..రోడ్లపై నిలబడి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. వెంటనే తనతో పాటు ఉద్యమంలోకి రావాలని..ఉద్యమంలో ముందు తన కుటుంబం ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయం కోసం అడుగుతుంటే కాలయాపన చేయడం సరికాదన్నారు. రాజధానికి, గ్రీన్ పోర్టు, భూములు తీసుకోవడానికి అర్ధరాత్రి జీవోలు జారీ చేసిన సందర్భాలున్నాయన్నారు. తమ స్పష్టమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఇంటికి వెళ్లేది లేదని ఖరాఖండిగా చెప్పడంతో ఆందోళన ఒక్కసారిగా రూటు మారింది.

Kapu-01
Kapu-010
Kapu-011
Kapu-012
Kapu-013
Kapu-014
Kapu-02
Kapu-03
Kapu-04
Kapu-05
Kapu-06
Kapu-07
Kapu-08
Kapu-09

* కాపులను బిసిలలో చేర్చడానికి కమీషన్ ను నియమించాలన్న రాష్ట్రమంత్రి వర్గనిర్ణయం కాలయాపన ఎత్తుగడే- ముద్రగడ.

* ప్రస్తుతం ఏ రాజకీయపార్టీలోనూ లేని ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్ పై ఆ వర్గం నాయకులు మేధావులతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. రాజకీయంగా అధికారంలోకి వస్తే కాపు సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న సూచనలను ముద్రగడ తిరస్కరించారు.” ఇందువల్ల అధికారంలోకి వచ్చిన వారు, వారి ప్రభావం పడే మరికొందరు ఎదుగుతారేమోకాని కాపుల్లో పేదలు పేదలుగానే వుండిపోతారు. సామాజికంగా ఆర్ధికంగా కాపులు ఎదగాలంటే రాజకీయపరమైన సర్దుబాట్లు కాక రాజ్యాంగ పరంగా చట్టబద్ధమైన హక్కులు సాధించవలసిందేనని” నిర్ధారించుకున్నాకే ఆయన కాపు మహాసభకు జనవరి 31 ముహూర్తంగా నిర్ణయించారు.
* చంద్రబాబు పాదయాత్ర సమయంలోనూ, 2014 ఎన్నికల ప్రచార సభల్లోనూ కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయించుకోవడమే మహాసభ ఎజెండా. కాపులను బిసిల్లో చేర్పించుకోవడం, వీరి సంక్షేమానికి ఏటా 1000 కోట్లరూపాయలు ఖర్చు చేయించుకోవడం తప్ప మరో డిమాండు లేదు
* ఇలా రోడ్డున పడటం ఏ రాజకీయపార్టీకీ, ఏకులానికీ వ్యతిరేకం కాదు. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే పుట్టగతులు వుండవు- ముద్రగడ.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaapu  Mudragada Padmanabham  Kaapu reservations  

Other Articles