Tiffin Boxes and Sarees to Voters in Hyderabad

Tiffin boxes and sarees to voters in hyderabad

GHMC, GHMC Polling, Hyderabad, Khutbullapur, Congress, tiffin boxes, sweet boxes, sarees

Political parties trying to attract voters in the GHMc Elections. In Kutbullapur, Congress leaders distributing tiffin boxes, sweet boxes and sarees.

ఓటర్లకు టిఫిన్ డబ్బాలు, చీరలు..?

Posted: 01/30/2016 08:28 AM IST
Tiffin boxes and sarees to voters in hyderabad

ఎన్నికల తతంగం ఇప్పుడు చివరి దశకు చేరింది. అన్ని పార్టీల అభ్యర్థులు తమ గెలుపుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నికల నియమావళిని ఉల్లింఘించి.. ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. తాజాగా కుత్భుల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున కొంత మంది వ్యక్తులు మహిళలకు టిఫిన్ బాక్సులు, స్వీట్ బాక్సులు, చీరలు పంచిపెడుతుండగా.. మీడియా కంట పడ్డారు. ఎన్నికల ప్రచారానికి సమయం ముగుస్తుండటం.. పోలీంగ్ తేదీ దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు ఇలా తప్పుడు దారులు పడుతున్నారు.

కుత్బుల్లాపూర్‌లోని చెరుకుపల్లి, రామకృష్ణానగర్ 131 డివిజన్‌లో టీడీపీ నేతలు చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. గౌతంనగర్ 141 డివిజన్‌లో టిఫిన్ డబ్బాలు పంచుతూ కాంగ్రెస్ అభ్యర్థి విజయానాయుడు అడ్డంగా దొరికిపోయారు.మరో మూడు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తరుణంలో హైదరాబాద్ గల్లిగల్లీలో ఇప్పుడు ఇదే వ్యవహారం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే మామూలుగా అయితే పోలింగ్ కు ముందు రోజు లేదంటే పోలింగ్ రోజు ఇలా ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ అంతకు ముందు నుండే ఇలా ఓటర్లకు చీరలు, టిఫిన్ డబ్బాలు పంచడం కనిపిస్తోంది. అయితే ఎన్నికల సంఘం ఎంత నిఘా ఉంచినా కానీ మూడు రోజుల ముందే ఈ తంతంగానికి తెర లేవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  GHMC Polling  Hyderabad  Khutbullapur  Congress  tiffin boxes  sweet boxes  sarees  

Other Articles