Civic workers dump waste at Manish Sisodia’s office

Civic workers dump waste at manish sisodia s office

Delhi, Manish Sisodia, Civic workers, Manish Sisodia face trouble

garbage started piling up across east Delhi after two days of strike by municipal employees even as protesters demanding payment of salaries dumped waste outside deputy CM Manish Sisodia's camp office in Khichdipur and on the streets of Laxmi Nagar and Pandav Nagar

డిప్యూటీ సిఎం ఆఫీస్ ముందు చెత్త చెత్త

Posted: 01/30/2016 08:26 AM IST
Civic workers dump waste at manish sisodia s office

పారిశుద్ధ్య కార్మికుల  సమ్మె ఢిల్లీని ముక్కుమూసుకునేలా చేస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన సెగ… కేజ్రీ సర్కారుకు ఊపిరాడకుండా చేస్తోంది.  వేతనాలు రెగ్యులర్ గా చెల్లించాలని… కార్మికులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. ఢిల్లీలో మొత్తం మూడు రకాల మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. వాటిలో 60 వేల మంది సఫాయి కార్మికులతో పాటు… మొత్తం లక్షా 25 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ఆరేడు నెలలుగా కార్మికులకు వేతనాల్లేవు. వేతన బకాయిల కోసం ఆప్ సర్కారు మీద తిరుగుబాటు చేశారు కార్మికులు. మొత్తం 27 కార్మిక సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి.

డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటి ముందు చెత్త వేసి వినూత్న నిరసనకు దిగారు కార్మికులు.  దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, ఆందోళకారులకు మధ్య తోపులాట జరిగింది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను ఆపేది లేదని.. వేతన బకాయిలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు కార్మికులు. కార్మికుల సమ్మెను లైట్ తీసుకున్నారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఇవి బీజేపీ నేతలు చేయిస్తున్న చెత్త రాజకీయాలని మండిపడ్డారాయన.  మరోవైపు కార్మికులు సమ్మెపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Manish Sisodia  Civic workers  Manish Sisodia face trouble  

Other Articles