KCR said that he had only constitutional friendship with Chanadrababu

Kcr said that he had only constitutional friendship with chanadrababu

Telangana, AP, Chandrababu Naidu, KCR, KCR Friendship with Chandrababu

Telangana cm KCR said that he had only constitutional friendship with AP CM Chanadrababu Naidu. naidu also said that friendship with KCR only for two states cooperation.

ITEMVIDEOS: కేసీఆర్, చంద్రబాబు దోస్తానీ.. వారి మాటల్లోనే

Posted: 01/29/2016 09:52 AM IST
Kcr said that he had only constitutional friendship with chanadrababu

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం కేసీఆర్ మధ్య ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం. ఒక సారి ఇద్దరు కలిసి నవ్వులు చిందిస్తారు. మరి కొన్ని సార్లు వాళ్లిద్దరు ఒకరి మీద మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటారు. మరి ఇద్దరు కలిసి ఓ సారి దోస్త్ మేరా దోస్త్ అని పాటలు పాడుకుంటారు.. మరికొన్ని సార్లు పంతం నీదా.. పంతం నాదా..? సై అంటూ కత్తులు దూసుకుంటారు. అయితే వీరి ఫ్రెండ్ షిప్ ఎట్లాంటిదో కేసీఆర్ వివరించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఓ క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి వివరించారు. ఆయన మాటల్లో ‘‘సిఎం అన్నాక..  రాజ్యంగపరమైన ఫ్రెండ్ షిప్ ఉంటుంది కదా... బ్రదర్’’ అంటూ సమాధానమిచ్చారు. అలాగే ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కూడా దీని మీద మాట్లాడారు. కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు రావడం.. తాను యాగానికి రావడం రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబందాలు ఉండాలన్న ఉద్దేశమే తప్ప.. పార్టీ పరంగా తాను ఎన్నటికీ తెలుగుదేశం వేరుగానే ఉంటుందని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  AP  Chandrababu Naidu  KCR  KCR Friendship with Chandrababu  

Other Articles