Inability to prevent Babri demolition was PVs biggest failure

Inability to prevent babri demolition was pvs biggest failure

pranab mukherjee, pranab book second issue, rajiv gandhi, babri masjid demolition, ayodhya doors opening

President Pranab Mukherjee, in the second volume of his memoir The Turbulent Years: 1980-96, has said that it was then Prime Minister PV Narasimha Rao's inability to prevent the demolition of the Babri Masjid that was his biggest failure.In his memoir, Mukherjee wrote that the demolition of the Babri Masjid was "an act of absolute perfidy, which should make all Indians hang their heads in shame," according to Hindustan Times.

బాబ్రీని కాపాడుకోలేకపోవడం పి.వి చేతకానీతనం

Posted: 01/29/2016 10:52 AM IST
Inability to prevent babri demolition was pvs biggest failure

గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పీరియడ్ లో జరిగిన వివాదాస్పద ఘటన మీద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన తాజా పుస్తకం మరోసారి కాకరేపింది. ఇందిరాగాంధీ హత్య, బాబ్రీ మసీదు కూల్చివేత, ఆపరేషన్‌ బ్లూ స్టార్‌, రాజీవ్‌గాంధీ కేబినెట్‌ నుంచి ఉద్వాసన వంటి పలు కీలకమైన అంశాలను పుస్తకంలో ప్రణబ్‌ ముఖర్జీ ప్రస్తావించారు. 1980-1990 మధ్య జరిగిన పలు అభివృద్ధి అంశాలు, స్వాతంత్య్రానంతరం సంభవించిన కల్లోల పరిస్థితులను కూడా అందులో పొందుపరిచారు. 'కల్లోల సంవత్సరాలు:1980-1996' పేరుతో విడుదల చేసిన ఈ పుస్తకంలో ప్రణబ్‌ ముఖర్జీ. . రాజీవ్‌గాంధీ కేబినెట్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన విషయాలను కూడా ప్రస్తావించారు. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఎదిగిన కాలం నుంచి పీవీ నరసింహరావు జాతీయ నేతగా వెలుగులోకి వచ్చిన కాలం వరకు పలు ముఖ్యమైన రాజకీయ అంశాలను పుస్తకంలో పొందుపరిచారు.

బాబ్రీ మసీదు విధ్వంసం అనేది నాటి ప్రధాని పి.వి.నరసింహారావు తప్పిదాల్లో అతిపెద్దదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.. బాబ్రీ విధ్వంసం వల్ల ముస్లింల సెంటిమెంట్లను ఆయన దెబ్బతీశారని రాశారు. బాబ్రీని కాపాడలేకపోవడం పీవీ చేతకానితనమన్నారు. బాబ్రీ విధ్వంసంతో భారతీయుల తలలు సిగ్గుతో తలదించుకునేలా అయ్యాయని ప్రణబ్ తన పుస్తకంలో రాశారు. బాబ్రీ విధ్వంసం కాకుండా ఉండేందుకు అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపి కఠిన చర్యలు తీసుకుని ఉండాల్సిందని ప్రణబ్ చెప్పారు. ఆపత్కర పరిస్థితుల్లో మీకు సలహాలు ఇచ్చేవారు ఎవరూ లేరా అని తాను పీవీని అడిగినట్లుగా ప్రణబ్ పుస్తకంలో రాశారు. బాబ్రీ విధ్వంసం వల్ల ముస్లింల సెంటిమెంట్లు దెబ్బతింటాయనే విషయాన్ని గుర్తించలేకపోయారా అని పీవీపై విరుచుకుపడినట్లు రాశారు. అయితే దీనికి జవాబుగా పీవీ ఎప్పటిమాదిరిగానే ఏమీ అర్ధం కాని ఎక్స్ ప్రెషన్ పెట్టారని ప్రణబ్ రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles