Slogans Disrupt PM Modi's Speech At Convocation In Lucknow

Slogans disrupt pm modi s speech at convocation in lucknow

PM Modi, Lucknow, PM Modi Speech Disrupted, HCU, Hyderbad Central University, Rohith, Rohith suicide

Protesters raised slogans, attempting to disrupt Prime Minister Narendra Modi's speech at the Babasaheb Bhimrao Ambedkar University in Lucknow, where he is chief guest at a convocation today. A student was escorted out of the auditorium and some protesters have been detained.

ITEMVIDEOS: మోదీకి షాక్.. రోహిత్ ఆత్మహత్య మీద నిరసనలు

Posted: 01/22/2016 04:20 PM IST
Slogans disrupt pm modi s speech at convocation in lucknow

ప్రధాని నరేంద్ర మోదీకి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వేడి తగిలింది. నిన్నటి దాకా స్ర్ముతి ఇరానీ, బండారు దత్తాత్రేయలకు తగిలిన సెగ ఇప్పుడు మోదీకి కూడా తాకింది.  ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్నాత్సకోవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆడిటోరియంలో మోదీ మాట్లాడుతున్న సమయంలో నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోదీ ముర్దాబాద్ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు.

అయితే ఆందోళన జరుగుతున్నా కానీ మోదీ మాత్రం తన ప్రసంగాన్ని ఆపలేదు. అంబేద్కర్ గురించి తన ప్రసంగాన్ని కొనసాగించారు. అంబేద్కర్ దేశం కోసం జీవించారని, దేశం కోసమే ప్రాణాలు అర్పించారన్నారు. అవరోధాలు, అవమానాలు ఎదుర్కొన్నా.. అంబేద్కర్ మాత్రం పట్టుదలతో ముందుకు వెళ్లారని మోదీ గుర్తు చేశారు. విద్య ద్వారా జీవితంలో అన్ని సమస్యలను ఎదుర్కోవచ్చని అంబేద్కర్ అన్నారని మోదీ తెలిపారు. మరోపక్క హెచ్.సి.యులో పరిస్థితి మీద విసి సమావేశం నిర్వహించారు. హెచ్.సి.యు వివాదం చిలికిచిలికి గాలి వానగా మారింది.. మోదీకి కూడా దాని సెగ తగిలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Lucknow  PM Modi Speech Disrupted  HCU  Rohith suicide  

Other Articles