High allert in nation

High allert in nation

Terrorists, India, ISIS, Delhi, Hyderabad, NIA, RAW, Intelligence

Six suspected terrorists were arrested on Friday by the National Investigation Agency (NIA) in Karnataka in coordination with the state police, Home Minister G Parameshwara said. The crackdown comes days after the arrest of a madarssa teacher from here for suspected links with al-Qaeda, and office of the Consulate General of France received a threat letter against French President Francois Hollande’s proposed visit to India on the occasion of the Republic Day.

దేశవ్యాప్తంగా హైఅలర్ట్.. ఉగ్రవాదుల అరెస్టు

Posted: 01/22/2016 04:18 PM IST
High allert in nation

గణతంత్ర్యదినోత్సవం దగ్గరపడుతోంది.. దేశంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో అని సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్  ఎన్ఐఏ, నిఘా, సైన్యాధికారులతో ఈ సాయంత్రం సమావేశం కానున్నారు. పఠాన్ కోట్ నుంచి ఓ కారును అద్దెకు తీసుకోని, ఆపై కారు డ్రైవర్ ను హతమార్చి ఢిల్లీలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న అనుమానం నేపథ్యంలో ఢిల్లీ, దాని చుట్టుపక్కలా ఉన్న యూపీ పరిధిలోని నోయిడా నుంచి ముజఫర్ పూర్ వరకూ అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టాక్సీ డ్రైవర్ ను హత్య చేసినట్టుగా భావిస్తున్న ముగ్గురు యువకుల కోసం దేశవ్యాప్తంగా జల్లడపడుతున్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలను టార్గెట్ గా చేసిన ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. దాంతో అన్ని రాష్ట్రాలు సెక్యురిటీని కట్టుదిట్టం చేశాయి. కాగా ఎన్ఐఏ నేరుగా రంగంలోకి దిగి అనుమానితులను అదుపులోకి తీసుకుంటోంది. అందులో భాగంగా బెంగళూరులో కొంత మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో కూడా నలుగరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు, ముంబై. దిల్లీ, హైదరాబాద్ మహా నగరాల్లో దాదాపు 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terrorists  India  ISIS  Delhi  Hyderabad  NIA  RAW  Intelligence  

Other Articles