Dalit scholar suicide: 10 SC/ST teachers at HCU resign, slam Smriti Irani

Hcu professors slam union minister snruti irani quits admn posts

Bandaru Dattatreya, Dalit student, Dalit scholar suicide, HRD Minister, Hyderabad Central University (HCU), P Appa Rao, Dalit professors, Rohith Vemula, Smriti Irani, suicide, Vice Chancellor

10 SC/ST teachers of Hyderabad Central University (HCU) have resigned from their administrative roles protesting Union HRD minister Smriti Irani's remarks

అగ్గి రాజేస్తున్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలు.. వాస్తవాల వక్రీకరణ

Posted: 01/21/2016 12:16 PM IST
Hcu professors slam union minister snruti irani quits admn posts

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ యువ మేధావి రోహిత్ వేముల మరణంపై మూడు రోజుల తరువాత స్పందించిన కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరాని అగ్గిరాజేశారు. అమె క్రితం రోజు సాయంత్రం చేసిన వ్యాఖ్యలతో విభేదిస్తున్న దళిత ప్రోఫెసర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని వాస్తవ పరిస్థులను తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రి స్మృతి ఇరాని వ్యాఖ్యలను తాము తీవ్రంగా నిరసిస్తున్న ఫ్రోపెసర్లు స్పష్టం చేశారు. అమె వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిపాలనా బాధ్యతల నుంచి తప్పుకుని కేవలం అధ్యాపక బాధ్యతల్లో మాత్రమే కోనసాగుతామని ప్రకటించారు. వర్సిటీ బోర్డులో దళిత ఫ్రోఫెసర్లు వున్నారని కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదంటున్నారు. వర్సటీ చరిత్రలో ఇప్పటివరకు దళిత ప్రోఫెసర్ ఒక్కరికి కూడా బోర్డులో స్థానం లభించలేదని వారు పేర్కోన్నారు.

విద్యార్థులను సస్పెండ్ చేసిన కమిటీలో వున్న దళిత ప్రోఫెసర్లు వున్నారని వారే విద్యార్థులను సస్పెండ్ చేశారని కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా సత్యదూరమని వారు చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా కేంద్ర మంత్రి హోదాలో తప్పులను.. ఒప్పులుగా చేస్తూ, స్మృతి ఇరానీ వ్యాఖ్యాలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదిలావుండగా, రోహిత్ కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ఈ నెల 25న యూనివర్శిటీ జేఏసీ 'ఛలో హెచ్ సీ యు' కు పిలుపు నిచ్చింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohith Vemula  Hyderabad Central University (HCU)  Smriti Irani  Dalit Professors  

Other Articles