TRAI slams Facebook

Trai slams facebook

TRAI, Facebook, Free Basics, India, Netnutrality, Free Basics from Facebook, Reliance

Telecom regulator TRAI has written a strongly worded letter to Facebook, slamming the social media giant for the way it ran the campaign to save its zero-rating platform ‘Free Basics’. The service was banned in India after TRAI issued a paper questioning the validity of differential pricing for some content services by ISPs. Facebook has tied up with Reliance Communications for Free Basics in India.

ఫేస్ బుక్ ఫ్రీబేసిక్స్ కు ట్రాయ్ షాక్

Posted: 01/21/2016 08:27 AM IST
Trai slams facebook

ఫేస్ బుక్ కు ట్రాయ్ కూడా అడ్డుకాలేసింది. ఫ్రీబేసిక్స్ పేరుతో రిలయన్స్ తో కలిసి చేయాలనుకున్న ప్లాన్ కు ట్రాయ్ ఝలక్ ఇచ్చింది. నెట్ న్యూట్రిలిటీకి భంగం కలిగించేలా ఫేస్ బుక్ ఫ్రీబేసిక్స్ పేరుతో పెత్తనం చెలాయించాలని అనుకుంటున్న ఫేస్ బుక్ మీద ట్రాయ్ ఫైరైంది. నెట్ న్యూట్రాలిటీ- ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ మధ్య వాదోపవాదాలు నడవడంతో.. ట్రాయ్ ప్రజాభిప్రాయ సేకరన చేసింది. ట్రాయ్ పిలుపుతో ఫ్రీ బేసిక్స్ కు అనుమతి ఇవ్వాలంటూ లక్షల మెయిల్స్ ట్రాయ్ కు చేరాయి. అయితే డేటా సర్వీసుల కోసం అమలులో ఉన్న వివిధ ధరలకు సంబంధించి ట్రాయ్ ఫేస్ బుక్ ను వివిధ ప్రశ్నలు అడిగింది. దీనికి ఫేస్ బుక్ ప్రతినిధి అంఖి దాస్ సరైన వివరణ ఇవ్వలేకపోయారు.

ఫ్రీ బేసిక్స్ ప్రచారం కోసం ఫేస్ బుక్ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపడుతూ దానికి సంబంధించిన అధికారిక లేఖను ట్రాయ్ విడుదల చేసింది. తన ఆలోచనకు మద్దతు కూడగట్టుకునేందుకు ఫేస్ బుక్ వ్యవహరించిన తీరు సరికాదని మండిపడింది. రాజ్యాంగబద్ద సంస్థగా వినియోగదారుల ప్రయోజనాల కోణంలో అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వకుండా కస్టమర్లతో ఫ్రీ బేసిక్స్ కు మద్దతు కూడగట్టుకోవాలనుకోవడం సరైంది కాదని ట్రాయ్ మండిపడింది. ఒకవేళ ఫేస్ బుక్ సూచనలను అంగీకరిస్తే.. అది ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ప్రమాదకర ప్రభావం చూపుతుందని ట్రాయ్ తన లేఖలో అభిప్రాయపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRAI  Facebook  Free Basics  India  Netnutrality  Free Basics from Facebook  Reliance  

Other Articles