Pakistan varsity attack: professor dies fighting with militants

Pak varsity attack professor dies fighting against terrorists

professor hamid hussain ,hamid hussain bachu khan university, Peshawar, Pakistan, chemistry professor, licensed pistol, Taliban militant, pakistan university attack, bachu khan university attack, pakistan news, world news

Assistant professor Syed Hamid Hussain, 34, fought back against the terrorists as he warned students not to leave the building of the Bacha Khan university.

తాలిబన్లకు ఎదురుతిరిగిన ఫ్రోఫెసర్.. విద్యార్థుల కోసం వీరమరణం..

Posted: 01/20/2016 09:30 PM IST
Pak varsity attack professor dies fighting against terrorists

పాకిస్థాన్లోని విశ్వవిద్యాలయంలోకి చోరబడి విద్యార్థుల ప్రాణాలను హరించేందుకు ఒక్కసారిగా కాల్పులతో తెగబడిన ఉగ్రవాదులను ఓ ప్రొఫెసర్ ధీటుగా ఎదుర్కోన్నాడు. తన వద్దనున్న చిన్న పాటి లైస్సెన్డు రివాల్వర్ తో వారిని ఎదుర్కునే ప్రయత్నం చేసి అసువుల బాసాడు. ఉగ్రవాద దాడి జరుగుతుందన్న వార్తతో జంకుతూ అటు వైపుగా వెళ్లేందుకే భయపడే మనుషులు వున్న ఈ రోజ్లుల్లో తన విద్యార్ధులను ముష్కరమూకల దాడి నుంచి తప్పించేందుకు ఫ్రోఫెసర్ చేసిన సాహసాన్ని విద్యార్థులు, సహచర సిబ్బంది కొనియాడుతున్నారు. అయితే తమ ఫ్రోఫెసర్ ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పోందారని వారు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్థాన్లో ఖైబర్ పక్తున్ ఖ్వా ప్రావిన్స్లోని బచాఖాన్ యూనివర్సిటీలోకి 12 మంది సాయుధులైన ఉగ్రవాదులు బుధవారం చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 24మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సమయంలోనే రసాయన శాస్త్రం బోధించే ప్రొఫెసర్ సయ్యద్ హమీద్ హుస్సేన్ (34) తన లైసెన్స్ రివాల్వర్ తో అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రాణాలువదిలాడు. ఆయన ప్రాణం కోల్పోయిన తీరును ఆ వర్సిటీ జువాలజీ విద్యార్థి కళ్లకు కట్టినట్లు తెలిపారు.

'ముందు కాల్పుల చప్పుళ్లు వినగానే మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ తానుచెప్పే వరకు భవనం వెలుపలికి రావొద్దని హెచ్చరించారు. అనంతరం ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తన తుపాకీ తీశారు. నేను చూస్తుండగానే ఆయనకు బుల్లెట్ తాకింది. ఆయన కూడా కాల్పులు జరిపారు. అయితే, అంతకంటే వేగంగా ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించడంతో నేను గోడ దూకి పారిపోయాను. మిగితా వాళ్లు కూడా అలాగే చేశారు. మా ప్రొఫెసర్ తో సహా 25మంది ప్రాణాలు విడిచారు' అని అతడు వివరించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Peshawar  Pakistan  chemistry professor  licensed pistol  Taliban militant  BachaKhanUniversity  

Other Articles