వాళిద్దరూ అక్కాచెలెళ్లు.. అయితే వారిని ఇనుప సంకెళ్లతో బంధించి.. ఒక చీకటి గదిలో బంధీలుగా మార్చారు. వాళ్లు చేసిన తప్పేంటో తెలియరాలేదు కానీ.. ఆస్తి కోసమా..? పెద్దల సుఖాలకు అడ్డుతగులుతున్నారనా..? లేక హద్దులు మీరుతున్నారనో మొత్తానికి వారిని ఇలా ఏళ్ల తరబడి బంధీలుగా మార్చేసింది వారి తల్లిదండ్రులే. ఇలా వాళ్లను బంధీలుగా వుంచి ఏన్ని ఏళ్లు అవుతున్నదన్న విషయం కూడా తెలియదు. అయితే ఇంతటి మానసిక క్షోభను అనుభవించిన ఇద్దరు అక్కచెలెళ్లను పరిశీలిస్తే మాత్రం వారు కొన్ని ఏళ్లుగా ఇలా వున్నారన్న విషయం అర్థమవుతుంది. వారి నోటి వెంట మాట అనేది రావడానికి కూడా బలం లేక కేవలం సైగలతోనే అంతా చేస్తున్నారు. కన్నవారే కసాయిలుగా మారి కనీసం మానవత్వం అన్న లేకుండా వ్యవహరించిన ఉదంతం కొలంబియాలోని ఈశాన్య ప్రాంతంలో జరిగింది.
కొలంబియాలోని ఓ ప్రాంతం నుంచి ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఒక ఫోన్‌కాల్ ను చేదించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది.. తమ అపార్ట్‌మెంట్‌లో ఉన్న బేస్‌మెంట్ గదిలో నుంచి ఏవో అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయన్నది దాని సారాంశం. అధికారులు వెంటనే అక్కడకు బయల్దేరి వెళ్లారు. ఆ గది వద్దకు వెళ్లి తలుపులు బద్దలుకొట్టి చూశారు. అక్కడ వారికి మానవ మృగాలుగా పడి ఉన్న ఇద్దరు యువతులు కనిపించారు. వారి చేతులు, కాళ్లు ఉక్కు గోలుసులతో కట్టేసి పడివున్నాయి. విపరీతంగా పెరిగిన జుత్తు, గోళ్లతో దుర్గంధపూరితంగా ఉన్నారు. సమాజానికి, మనుషులకు దూరంగా ఉండడంతో మానసిక క్షోభతో వారు పూర్తిగా మానసిక రోగులుగా మారిపోయారు. వారిని విడిపించి విచారణ ప్రారంభించిన అధికారులు.. వాళ్ల కథ విని కన్నీళ్లు పెట్టుకున్నారు.
పదేళ్ల క్రితం వారిని ఇంటిలోనే బంధించిన తల్లిదండ్రులు వారానికొకసారి వారి వద్దకు చేరుకుని కేవలం రెండు రోజులకు సరిపడా అహారం, మంచినీళ్ల బాటిళ్లను మాత్రం ఇచ్చి తిరిగి వెళ్తుంటారు. అహారం సరిపోక వారు ఇంటి గోడలలోని ఇటుకలను, సమీపంలోని చెక్కను తిని జీవిస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్లుగా జరగుతున్నా స్థానికులెవరికీ ఈ సమాచారం తెలియదు. ఈ ఇద్దరనీ కనిపెట్టుకోడానికి ఓ తొంబై ఏళ్ల పండు ముసలి తాతయ్య మాత్రమే అక్కడ వున్నాడు. తాము తప్ప ఎవరు వచ్చినా తలుపులు తీయకూడదని అధికారులు అదేశించారు. దీంతో వారి అదేశాలను పాటిస్తూ అయన నిత్యం ఇంటికి గడిప పెట్టే ఉంచేవాడు. అయితే విషయం బయటికి పోక్కడంతో కన్నవారు పరారీలో వున్నారు. వారు దొరికితే కానీ అసలు కారణాలు తెలియవని పోలీసులు అంటున్నారు. కాగా కన్నవారిపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు. బాధితులైన అక్కాచెల్లెలిద్దరినీ పునరావాస కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more