Modi approves farmer crop insurance after suicides

Modi woos rural india with new crop insurance scheme

pradhan mantri fasal bima yojana, crop insurance, crop insurance scheme, india agriculture, $1.3 billion insurance scheme, crop failures, indian government to pay premium, crop insurance premium, land acquisition bill, PM Narendra Modi, PM Modi

India’s government approved a $1.3 billion insurance scheme for farmers to protect against crop failures, saying it was intended to put a halt to a spate of suicides.

‘అన్న’దాతకు అండగా కేంద్రం.. సంక్రాంతి కానుకనందించిన ప్రభుత్వం

Posted: 01/14/2016 10:00 AM IST
Modi woos rural india with new crop insurance scheme

దేశానికి వెన్నుముక్కగా నిలిచిన అన్నదాతలు పంటలు పండక.. ఆకలితో కుటుంబాలను నడపలేక.. అప్పు కూడా పట్టుకపోవడంతో తనువులు చాలించుకుంటున్న నేపథ్యంలో అన్నదాతలకు అండగా నిలవాలని.. పెద్దన్న పాత్ర పోషించాలని భావిస్తుంది కేంద్రం. ఇప్పటికే భూ సమీకరణ చట్టంలో మార్పులు కోసం ప్రవేశపెట్టిన బిల్లుతో రైతాంగాన్ని తనకు వ్యతిరేకంగా మార్చుకున్న కేంద్రం పనిలో పనిగా వారిని తమకు దగ్గరగా చేర్చుకోవాలని కూడా వ్యూహాన్ని రచించింది. ఆ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కడంతో.. ఉపసంహరించుకున్న కేంద్రం.. దేశంలో మునుపెన్నడూ లేనంతగా రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడటంపై కూడా దృష్టి సారించి.. సంక్రాంతి కానుకను అందించింది.

కేంద్రం ప్రకటించిన కానుక మేరకు ఇకపై రైతన్నలు పంటల బీమా పథకాన్ని ఉచితంగానే అందుకోనున్నారు. ఇప్పటిదాకా పంటల బీమా కోసం ప్రీమియాన్ని రైతులే భరించాల్సి వచ్చేది. ఇకపై రైతులు నామమాత్రపు రుసుము చెల్లిస్తే, మెజారిటీ భాగాన్ని తానే చెల్లించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో సగాన్ని కేంద్రం, మరో సగాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించేలా రూపొందించిన పకడ్బందీ ప్రణాళికకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతేకాక ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రైతుల సుదీర్ఘ వినతి మేరకు ఇకపై మండలాన్ని యూనిట్ గా కాకుండా, గ్రామాన్ని యూనిట్ గా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అన్నదాతల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం కోసం కేంద్రంపై ఏటా రూ.8.8 వేల కోట్ల భారం పడనుంది. నారు మళ్ల నుంచి పంట నూర్పిడి దాకా కూడా బీమా కొనసాగనుంది. అంతేకాక వడగళ్ల వర్షాలు, కొండచరియల వల్ల జరిగే నష్టానికి కూడా ఈ పథకంలో బీమా వర్తించనుంది. కరవు బృందాల పర్యటనలు, అధికారుల నివేదికలతో పనిలేకుండా... నష్టపోయిన తన పంట పొలం ఫొటోను రైతు స్మార్ట్ ఫోన్ లో పంపితే కూడా బీమా వర్తించే విధంగా ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pradhan mantri fasal bima yojana  crop insurance  PM Narendra Modi  

Other Articles