KTR to resign if TRS fail in GHMC elections

Ktr to resign if trs fail in ghmc elections

TRS, KTR, GHMC, GHMC Elections, GHMC Polls, KTR on GHMC elections

Telangana IT and Panchayat Raj Minister KT Rama Rao has vowed to resign if Telangana Rashtra Samiti (TRS) won't win GHMC elections. Speaking at a Meet the Press organized by Hyderabad journalists here on Monday, KTR exuded confidence that his party will win above 100 out of 150 seats in GHMC elections. The MIM will be in the second position and BJP in third, he predicted. Congress won't get even 10 seats, he added.

గులాబీ జెండా ఎగరకపోతే రాజీనామాకు కేటీఆర్ సవాల్

Posted: 01/11/2016 04:27 PM IST
Ktr to resign if trs fail in ghmc elections

టీఆర్ఎస్ పై ప్రగల్భాలు పేలుతున్న కిషన్ రెడ్డి మాటలు చూస్తే బీజేపీ భారతీయ జోక్ పార్టీ అన్నారు కేటీఆర్. మతాన్ని పట్టుకుని తిరుగుతూ ప్రజలను పట్టించుకోని పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. పాతబస్తీ అభివృద్ది చెందకపోవడానికి మజ్లిస్ పార్టీనే కారణమంన్నారు. గతంలో గ్రేటర్ పీఠాన్ని ఏలిన మజ్లీస్... ఏం చేసిందని ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్ లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని, ఇంకో 15 ఏళ్లు సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఎంతమంది సినిమా యాక్టర్లు వచ్చినా తమకు పోయేదేమి లేదని, కేసీఆర్ గ్లామర్ తమకు ఉందన్నారు. ఆ రోజు తమాషాగా అన్న మాటలను చిలువలు వలువలు చేశారని కేటీఆర్ విమర్శించారు.

 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పీఠంపై గులాబీ జెండా ఎగరకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. నా సవాల్‌ను స్వీకరించేందుకు ప్రతిపక్షాలు ముందుకు వస్తాయా అని ప్రశ్నించారు. 100 స్థానాల్లో విజయం సాధిస్తాం, ఎవరితోనూ పొత్తు లేదని తేల్చి చెప్పారు. నాకు మంత్రి పదవే ఎక్కువ... ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని తేల్చి చెప్పారు. మరో 15 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు.తనకు మంత్రి పదవే ఎక్కువని ముఖ్యమంత్రి పదవి మీద తనకు మోజు లేదని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  KTR  GHMC  GHMC Elections  GHMC Polls  KTR on GHMC elections  

Other Articles