Anyone harming country should be given same lesson

Anyone harming country should be given same lesson

Manohar Parrikar, Army, Indian Army, Defence Minister, Pathankot attack, Pakistan

While addressing at the 66th Army Day celebrations in Delhi Defence Minister Manohar Parrikar on Monday said that anyone who harms the country, should be given the same lesson. He also said that until the pain inflicted on the soldiers is transmitted, terror organisations will always enjoy giving pain to the country. He further stated that he is proud of the country's solders but he felt pained when the soldiers died.

ITEMVIDEOS: శత్రవుకు కూడా ఆ బాధ తెలియాలంటున్న రక్షణమంత్రి

Posted: 01/11/2016 04:25 PM IST
Anyone harming country should be given same lesson

కన్నుకు కన్ను అనేది మన సిద్దాంతం కానీ.. ఎదుటి వాళ్లు మనల్నిఎన్నిసార్లు దాడి చేసినా కానీ ఊరికే కూర్చోమని మాత్రం ఎక్కడా లేదు. పాకిస్థాన్ ఉగ్రవాదులు మన దేశం మీద ఎన్నో సార్లు దాడులకు పాల్పడ్డారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. అయితే వారిని అడ్డుకోవడంలో మన వీర సైనికులు కూడా తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. అయితే తాజాగా పటాన్ కోట్ దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలను కోల్పోయారు. అయితే రక్షణ మంత్రి మన ఆర్మీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ప్రతి సైనికుడిలో కసిని పెంచుతాయి. భరతమాత రక్షలో ముందుకు కదిలేందుకు ఎంతో తోడ్పడతాయి.

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల మెరుపు దాడి నేపథ్యంలో భారత సైనికులకు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ధైర్యాన్ని నూరిపోయడమే కాక శత్రువులకు గుణపాఠం చెప్పాల్సిన గురుతర బాధ్యతను గుర్తు చేశారు. భారత సైనికుల్లో ఏ ఒక్కరు చనిపోయినా, తనకు చాలా బాధేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. త్యాగధనుల పట్ల తమకు గౌరవం ఉందని ప్రకటించిన పారికర్, శత్రువుకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అసలు మన సైనికులు ప్రాణాలు కోల్పోతే, మనం ఏ స్థాయిలో బాధపడుతున్నామో, అదే బాధ శత్రువుకు అర్థయ్యేలా చేయాలని ఆయన సైన్యానికి పిలుపునిచ్చారు. తద్వారా శత్రువుపై ఏ మాత్రం కనికరం చూపాల్సిన అవసరం లేదని ఆయన పరోక్షంగా సైన్యానికి సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manohar Parrikar  Army  Indian Army  Defence Minister  Pathankot attack  

Other Articles