Indian hackers attack Pakistani websites as a tribute to Lt Col Niranjan Kumar

Indian hackers attack pakistani websites as a tribute to lt col niranjan kumar

Indians, Indian hackers, Pakistan, cyber attack, pathankot, black hats, Niranjan, Vismaya

As a tribute to Pathankot terror attack martyr, National Security Guard (NSG) officer Lieutenant Colonel Niranjan Kumar, a group of Indian hackers have attacked a host of Pakistani websites on Wednesday, 6 January.

పాక్ కు షాక్.. భారత హాకర్ల నివాళి అదిరింది

Posted: 01/08/2016 01:20 PM IST
Indian hackers attack pakistani websites as a tribute to lt col niranjan kumar

మన పక్కలో బల్లెంలా తయారైన పాకిస్థాన్ ఎప్పుడూ మన మీద దాడి గురించి.. మన దేశంలో అహింసను ఎలా పెంచాలా అంటూ తలలుపట్టుకుంటుంది. అయితే భారత్ మాత్రం దాన్ని పెడచెవినపెడుతోంది. అందుకే పాకిస్థాన్ నుండి ఎంతో మంది ఉగ్రవాదులు దేశం మీదకు దాడికి దిగారు.. దిగుతున్నారు.. ఇక మీదట కూడా దిగుతూనే ఉంటారు. అయితే తాజాగా పంజాబ్ లోని పటాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రవాదులు దాడి జరిపి మన దేశానికి ముప్పు తేవాలని దాడికి తెగించారు. కానీ భరత మాత ముద్దు బిడ్డలు, మన వీర సైనికులు వారికి అడ్డుకట్ట వేశారు. మన ఎయిర్ బేస్ లోకి వచ్చిన ఉగ్రవాదులను అంతమొందించారు. అయితే అలా చేసే ప్రయత్నంలో భరతమాత తన ముద్దు బిడ్డలను, వీర సైనికులను త్యాగం చెయ్యాల్సి వచ్చింది.

కల్నల్ నిరంజన్ తో పాటు మరో ఆరుగురు సైనికులు మన భరతమాత కోసం ఆనందంగా బుల్లెట్లకు ఎదురునిలిచి.. ఉగ్రవాదులకు వెన్నులో వణుకుపుట్టించి.. చివరకు ఆనందంగా నేలకొరిగారు. దేశం వారి త్యాగానికి వందనం చేసింది. భరతమాత ముద్దు బిడ్డలకు దేశం మొత్తం సెల్యూట్ చేసింది. పాకిస్థాన్ చేసిన దాడిని బారతీయులు ముక్త కంఠంతో ఖండించారు. అయితే మన రాజకీయ వ్యవభిచారుల్లాగా మన సైనికులు మాత్రం చేతులు కట్టుకు కూర్చోరుగా... అందుకే యుద్ద రంగంలో వీర మాత ముద్దు బిడ్డల్లాగా పోరాటానికి దిగారు. విజయమో వీర మరణమో అన్నట్లు మన సైనికులు శత్రువులను మట్టుబెట్టారు. అయితే దేశంలో ఒకరొకరు ఒకోలా వీర సైనికులకు తమ నివాళిని అర్పించారు. అయితే మన హ్యాకర్లు మాత్రం పాకిస్థాన్ కు చెమటలు పట్టించారు.

మన సైనికులు యుద్ద రంగంలో ఆయుధాలతో పాకిస్థాన్ వాళ్లకు చెమటలు పట్టిస్తే మన హ్యాకర్లు కీ బోర్డ్, మౌస్ తో చెమటలు పట్టించారు. మన వీర సైనికులకు నివాళిగా పాకిస్థాన్ కు చెందిన దాదాపు 15 ప్రభుత్వ సైట్లను హ్యాక్ చేశారు. అయితే దేశంలో ఉన్న వివిధ హ్యాకర్ల గ్రూపులు కలిసి కట్టుగా ఒక్కసారిగా పాక్ సైట్లను హ్యాక్ చేశాయి. కేరళకు చెందిన హ్యాకర్లు ఇండియన్ బ్లాక్ హ్యాట్స్ పేరుతో పాకిస్థాన్‌కు చెందిన ఏడు వెబ్‌సైట్లలోకి చొరబడ్డారు. వీటిలో పాకిస్థాన్ బార్ కౌన్సిల్ వెబ్‌సైట్ కూడా ఉంది. పఠాన్ కోట్‌ ఉగ్రవాద దాడిలో ప్రాణ త్యాగం చేసిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్‌కు నివాళులర్పించారు. ఈ హ్యాకింగ్‌ను కల్నల్ నిరంజన్ కుమార్తె విస్మయ (18 నెలలు)కు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.

తాము వెబ్‌సైట్ల నుంచి దేనినీ తొలగించలేదని, లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్తె విస్మయ ఫొటోను మాత్రమే అప్‌లోడ్‌ చేశామని హ్యాకర్లు వెల్లడించారు. తమది సైబర్ యుద్ధం కాదని, పాకిస్థాన్ ప్రజలకు సందేశమని స్పష్టం చేశారు. ఈ ఫొటో క్రింద ‘‘పఠాన్‌కోట్‌ దాడిలో ప్రాణాలర్పించిన ధైర్యసాహసాలు నిండిన సైనికుల కుటుంబాలకు ఐబీహెచ్ టీమ్ తరపున గొప్ప గౌరవ వందనం సమర్పిస్తున్నాం. మన దేశం, మన ప్రజల కోసం విలువైన జీవితాలను సమర్పించిన ధైర్యవంతులైన సైనికులకు చిన్న నివాళి. మేం క్షమిస్తాం. మేం మర్చిపోతాం.. మా నుంచి మరేమీ ఆశించకండి. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం, భారత మాతాకీ జై, వందేమాతరం అని రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indians  Indian hackers  Pakistan  cyber attack  pathankot  black hats  Niranjan  Vismaya  

Other Articles