Telugu student commits suicide in America

Telugu student commits suicide in america

Shiva Karan, Suicide in America, Telugu Student Suicide in America, USA

A Telugu student has committed suicide in USA. Shiva Karan was pursuing studies at North Carolina university. He hanged himself at his campus hostel at North Carolina.He is basically a native of Ramanthapur in Hyderabad. There are reports that US authorities are unnecessarily objecting the students citing various administrative reasons. AATA President while talking to TV9 media said that they are yet to know the details of the incident.

ITEMVIDEOS: అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

Posted: 01/08/2016 12:23 PM IST
Telugu student commits suicide in america

అగ్రరాజ్యంఅ అమెరికాలో తెలుగు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీలో శివ కిరణ్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ రామంతపూర్ లో నివాసం ఉండే శివ కిరణ్ నగరంలో ఐఐటీ పూర్తి చేశాడు. నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీలో ఎంఎస్ అభ్యసిస్తున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో శివకిరణ్ మనోవ్యేధనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలసుకున్న అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

రామాంతపూర్‌కు చెందిన శివకరన్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. ప్రాథమిక విద్యను హఫ్సీగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో పూర్తి చేసిన శివకరన్.. ఇంటర్ మీడియట్ నారాయణ కళాశాలలో పూర్తిచేశాడు. అనంతరం మెదక్ జిల్లా ఎద్దుమైలారంలోని ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. విద్యాభ్యాసం అనంతరం పలు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని కాదని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. నార్త్‌కరోలినా యూనివర్సిటీలో సీటు సంపాదించిన శివకరన్ ఆరు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. తరచు తల్లిదండ్రులతో చదువుకు సంబంధించిన విషయాలను ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన పరిక్ష ఫలితాల్లో తాను అనుకున్న గ్రేడ్ సాధించలేకపోవడంతో.. పాటు మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెందాడు. చివరకు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiva Karan  Suicide in America  Telugu Student Suicide in America  USA  

Other Articles