Teachers order to remove clothes in classroom

Teachers order to remove clothes in classroom

Warangal, Parakala, Teachers, Remove clothes, Punishment

In Warangal dist Parakala, A school teachers harrsing students. Teacher order to remove clothes for not doing home work.

ITEMVIDEOS: హోంవర్క్ చెయ్యకపోతే బట్టలిప్పమన్నారు

Posted: 01/04/2016 01:21 PM IST
Teachers order to remove clothes in classroom

ఏంటీ ఇలాంటి దారుణాలు కూడా జరుగుతాయా అని అనుకుంటున్నారా..? కానీ జరుగుతున్నాయి. చదువులు చెప్పి విద్యా బుద్దులు నేర్పి తమ పిల్లలను ప్రయోజకులను చేస్తారని అనుకున్న తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది. టీచర్లు సైకోలుగా మారుతున్నారు. హోంవర్క్ చెయ్యకపోతే.. ఏకంగా బట్టలూడదీయాలంటూ టీచర్లు చేసిన దాష్టికానికి అంతా షాకవుతున్నారు. చిన్న పిల్లలను అలా కఠినంగా శిక్షించడం ఏంటీ అనుకుంటున్నారు. వరంగల్ జిల్లా పరకాలలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై మరిన్ని వివరాలు మీ కోసం..

వరంగల్‌ జిల్లా పరకాల పట్టణ శివారులోని జ్యోతి కాన్వెంట్‌ స్కూల్‌లో హోం వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ల పేరిట విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారు. తాము చెప్పినట్లుగా ప్రవర్తించడం లేదని స్టూడెంట్స్‌పై ప్రతాపం చూపిస్తున్నారు. డిసెంబర్‌ 31న ఒకే తరగతికి చెందిన 25 మంది బాలుర వస్త్రాలు ఊడదీసిమరీ చితకబాదారు. విషయం తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలిసింది. చిన్నారులను కొట్టడంపై వాళ్ల తల్లిదండ్రులు స్కూల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వాళ్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. తమ స్కూల్‌లో హోంవర్క్ లు, ప్రాజెక్ట్ వర్క్ లు చేయకపోతే పనిష్మెంట్‌ ఇలాగే ఉంటుందని బుకాయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Warangal  Parakala  Teachers  Remove clothes  Punishment  

Other Articles