Violent showdown as crocodile bites down on trunk of poor elephant

Crocodile attacks elephant at watering hole

Animals, Banks, Fitness, Elephants, Crocodiles, Lions, Sabi Sands Game Reserve, South Africa, bull elephant, Violent showdown crocodile trunk of elephant, crocodile vs elephant, elephant vs crocodile

The crocodile is almost lifted from the water by the bull elephant, in the Sabi Sands Game Reserve in South Africa

ITEMVIDEOS: కలియుగంలో గజేంద్ర మోక్షం.. విష్ణుమూర్తి రాకుండానే విజయం..

Posted: 12/28/2015 04:25 PM IST
Crocodile attacks elephant at watering hole

గజేంద్ర మోక్షం కథ తెలుసుగా, తనను కాపాడమని ఎంతో ఆర్తిగా, అర్థిస్తూ.. ఆ మహావిష్ణును పిలువగానే.. బోజనం చేస్తున్న విష్ణుమూర్తి తన గధ, శంఖు, చక్రాదులన్నింటీనీ వదలి పరుగుపరుగున పుడమికేగి గజేంద్రుడిని రక్షించేందుకు మొసలిని హతమర్చుతాడని మన పురాణాలు చెబుతున్నాయి. దీని బట్టి దైవాన్ని నమ్ముకున్న వారు తమకు సాయం చేయాలని దేవున్ని అర్థిగా ప్రార్థించిన పక్షంలో ఆ దైవం ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతుందని సారాంశం. ఇక మరో తన భక్తుల కోసం ఆ మహావిష్ణువు తాను ఎక్కడ, వున్నా, ఎలా వున్నా పరుగెత్తుకోస్తాడని కూడా ఈ కథ ద్వారా పెద్దలు చెబుతుంటారు.

అయితే పుణ్యాత్ములు వెతికినా దొరకని ప్రస్తుత కాలంలో మనిషికి సాయం చేసేందుకు వారికి సొంత ధైర్యాన్ని ఇస్తున్నాడు ఆ పరమాత్ముడు. లేదా మనిషి రూపంలోనే వచ్చి తన భక్తులకు సాయం చేస్తున్నాడు ఆ లోకరక్షకుడు. ఇప్పుడిదంతా ఎందుకంటారా..? ఏం లేదు ఈ ఫొటో చూడగానే నాటి గజేంద్రమోక్షం సీన్ గుర్తుకురావడంతో.. అలా.. విషయానికి వస్తే దక్షిణాఫ్రికాలోని  సబీ శాండ్స్ గేమ్ రిజర్వు పార్కులో దాహంతో అలమటిస్తున్న ఓ చిన్నారి ఏనుగు నీటి కోసం వెతికింది.

అక్కడున్న ఓ కాలువలోకి వెళ్లి నీళ్లు తాగి, తన వంటిపై పోసుకోబోయింది. అంతే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఒక మొసలి కాస్త కన్ఫ్యూజ్ అయి ఈ గజేంద్రుడి కాలికి బదులు తొండాన్ని పట్టుకున్నట్లుంది. అంతే ఒక్కసారిగా విష్ణుమూర్తిని తలచుకుని వెయ్యి ఏనుగుల బలాన్ని పుంజుకుని తన.. తొండాన్ని లేపి ఇలా విసిరికొట్టడంతో మొసలి అల్లంత దూరాన ఎగిరి పడింది. ఇది కలియుగ గజేంద్ర మోక్షం.. విష్ణుమూర్తి రాకుండానే గజేంద్రుడిని వరించిన విజయం

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : elephant  crocodoile  sabi sands game reserve bank  

Other Articles