gang-raped-to-avenge-poll-defeat

Gangrape victim in lucknow kills self

lucknow, lucknow girl gangraped, gangrape victim kills self, lucknow gangrape victim, pandri police station, Mirzapur district lucknow news, uttarpradesh gang rape

The victim’s mother was elected as Block Development Committee member in the recently held panchayat polls and the accused are brothers of her rival candidates.

పోలీసుల తీరుకు నిరసనగా బాధిత బాలిక అత్మహత్య

Posted: 12/27/2015 10:53 AM IST
Gangrape victim in lucknow kills self

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మిర్జాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణింరుకోలేని ప్రత్యర్థి వర్గాలు.. గెలుపొందిన మహిళా అభ్యర్థి కూతురి(మైనర్)ని అపహరించి అమెపై సామూహిక అత్యాచారం జరిపారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మైనర్‌ను గడిచిన బుధవారం రాత్రి అపహరించి అత్యాచారం జరిపారు. తనకు జరిగిన దారుణ అన్యాయంపై బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

కాగా పోలీసులు కేసు నమోదుకు నిరాకరించారు. పోలీసుల తీరుతో, తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర మనోవేదనకు గురైన బాలిక శుక్రవారం ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. బాలిక మృతి అనంతరం స్పందించిన పోలీసులు చేతులు కాలాక, ఆకులు పట్టుకున్న చందంగా అప్పుడు ప్రత్యర్థికి చెందిన ఇద్దరు నిందితులు బిందు, పప్పులను అరెస్టు చేసి వారిపై సామూహిక అత్యాచారం, ఆత్మహత్యకు కారకులుగా, దీంతో పాటు మైనర్ బాలికపై లైంగిక వేదింపులకు గురిచేసిన చట్టాల కింద కేసును నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gang rape  poll defeat  uttarpradesh  

Other Articles