tamilnadu, ap governors attended to ayutha chandi maha yagam

Sharadh pawar attended to ayutha chandi maha yagam

Ayutha Chandi Yagam, Erravalli, CM KCR, telangana, Medak district, sharadh pawar, geetha reddy, governer narasimhan, Tamilnadu governer, K, Roshaiah, nagarjuna,

eeravalli farm house turned into a pilgrimage as ayutha chandi yagam perfoming by Telangana chief minister kcr,

ఆయుత చండీయాగానికి అథిరథ మహారథులు హాజరు

Posted: 12/26/2015 05:51 PM IST
Sharadh pawar attended to ayutha chandi maha yagam

లోకకల్యాణం కోసం తలపెట్టిన అయుత చండీ మహాయాగం నాలుగో రోజు వైభవోపేతంగా కొనసాగుతుంది. సీఎం కేసీఆర్, రుత్విజులు ఎరుపు వర్ణం వస్ర్తాలు ధరించారు. గురు ప్రార్థనతో యాగం ప్రారంభమైంది. సప్తద్రవ్యమృత్యుంజయ హోమం, ఏకాదశన్యాసపూర్వక చతుస్సహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, మహాసౌరము, ఉక్తదేవతా జపములు, దంపతీపూజ, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం ధార్మిక ప్రవచనం, కోటి నవాక్షరీ జపం, అష్టావధాన సేవ, మహా మంగళహారతి, విశేష నమస్కారములు, తీర్థ ప్రసాద వితరణం జరుగుగా, రాత్రి 7.30 గంటలకు శ్రీమాతా భువనేశ్వరి చక్రి భజన జరగనుంది. యాగాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మంత్రి హరీష్‌రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అయుత చండీ మహా యాగానికి పలువురు ప్రముఖులు, భక్తజనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇవాళ చండీయాగంకు తమిళనాడు గవర్నర్ కొణిజేటీ రోశయ్య హాజరయ్యారు. రోశయ్యకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎదురెళ్లి ఆహ్వానించారు. యాగశాలలో సీటుపై ఆసీనులైన రోశయ్య యాగాన్ని వీక్షించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా యాగశాలకు విచ్చేశారు. హరీష్ రావు వారిని దగ్గరుండి యాగశాలకు తీసుకువచ్చారు. ఆ తరువాత నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ ఆయుత చండీ హోమం నిర్వహించే ఎర్రవెల్లికి విచ్చేశారు. అతిరథ మహారధులను సీఎం కేసీఆర్ సాదరంగా స్వాగతించి సన్మానించారు. వీరితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, సినీనటుడు నాగార్జున, ఇతర అతిధులు హాజరయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayutha Chandi Yagam  sharad yadav  governer narasimhan  Tamilnadu governer  Roshaiah  

Other Articles