He became a theaf because of cinema mania

He became a theaf because of cinema mania

Ciname, balamurugan, Robber, Hyderbad, Manasa Vinava

He became a theaf because of cinema mania. balamurugan name robber a producer and rich personality for the cinema mania.

వాడి సినిమా పిచ్చి దొంగను చేసింది

Posted: 12/24/2015 04:06 PM IST
He became a theaf because of cinema mania

పిచ్చి.. ఒక్కో మనిషికి ఒక్కో దానిలో పిచ్చి ఉంటుంది. పిచ్చిని ఎలా చూపించాలో మనలో చాలా మందికి తెలియదు. అయితే మనలో చాలా మందికే సినిమా పిచ్చి మాత్రం ఉంటుంది. అలా ఓ సినిమా పిచ్చి ఓ వ్యక్తిని.. నిర్మాతగా, పెద్ద ధనవంతుడిగా చివరకు దొంగను చేసింది. హైదరాబాద్ లో పోలీసులు ఛేదించిన ఓ సినిమా పిచ్చోడి క్యారెక్టర్ ఏంటో తెలిస్తే మాత్రం పిచ్చెక్కడం ఖాయం. ఎంతో కాలంగా స్పెషల్ గా అంటే విఐపిగా కనిపిచాలన్నది బాలమురుగన్ కోరిక. అయితే దానికి కేవలం సినిమా వాళ్లే అన్న నిర్ణయానికి వచ్చి.. చివరకు సినిమా రంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. దాంతో సినిమాలు తీద్దామని ఫిక్సయ్యాడు. కానీ దానికి డబ్బులు కావాలి కదా.. మరి అందుకే ఓ రూట్ ఎంచుకున్నాడు.

సమాజంలో ప్రముఖుడిగా చెలామణీ కావాలంటే సినిమాలోకమే సరిగ్గా సరిపోతుందని బాలమురుగన్‌ భావించేవాడు. అప్పటి వరకూ ఇళ్లలో దొంగతనాలు చేయడం, వాహనాలను ఎత్తుకెళ్లడం వంటివి మాత్రమే చేసిన అతడు.. సినిమా పిచ్చితో దోపిడీ దారి పట్టాడు. అదే సమయంలో తన చిన్న చెల్లెలు కనకవల్లి కుమారుడు సురేశ్‌ సినిమాల వేటలో ఉండడంతో హీరోగా చేస్తానని చెప్పి తన ముఠాలో చేర్చుకున్నాడు. సినిమా కోసం హైదరాబాద్‌ చేరి బంజారాహిల్స్‌లోని ఇందిరానగర్‌లో నివాసం ఏర్పరుచుకున్నాడు. ఒకవైపు లూటీలకు ప్లాన్‌ వేస్తూనే మరోవైపు టాలీవుడ్‌ నటులతో పరిచయం పెంచుకున్నాడు.

దోచేసిన సొత్తుతో తన తొలి సినిమా మనసా విన్నావా తీశాడు. తరువాతి సినిమాకు భారీ మొత్తం కావాల్సి రావడంతో లూటీ ప్లాన్‌ వేసి నివాసాన్ని కిస్మతపూర్‌కు మార్చాడు. 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు. అక్కడి నుంచే చిత్తూరు, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో బ్యాంకులు కొల్లగొట్టాడు. ఆ సొమ్ముతో ఎర్త్‌మూవర్స్‌ వ్యాపారం నిర్వహించేవాడు. పాండిచ్చేరి, నాగపట్నం ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకున్నాడు. మొత్తానికి చివరకు చేసిన తప్పుకు పోలీసులకు దొరికిపోయి.. ప్రస్తుతం కస్టడీని ఎదుర్కొంటున్నారు. అమ్మాయిలంటే విపరీతమైన మోజు! ఆ మోజుతోనే 600 మంది మహిళలతో వివాహేతర సంబంధాలు నెరిపాడు. వాటి వల్ల ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రెండో భార్యను వదిలేశాడు. పిల్లలు లేకపోవడంతో లక్షలు పోసి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నాడు. ఇదీ అతడి రెండో వైపు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ciname  balamurugan  Robber  Hyderbad  Manasa Vinava  

Other Articles