BTech Student Falls off Hotel Building in Petbasheerabad

Btech student falls off hotel building in petbasheerabad

Sai Kiran, Hyderabad, Hostel, Student died in Hostel, Khammam student died

A student in Hyderabad petbasheerbagh police station area, tried to jump from a wall, he slips and died.

ITEMVIDEOS: గోడ దూకబోయి ప్రాణం పోగొట్టుకున్నాడు

Posted: 12/23/2015 04:39 PM IST
Btech student falls off hotel building in petbasheerabad

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి సరదా ప్రాణం మీదకు తీసుకువచ్చింది. చివరకు ఓ విద్యార్థి ప్రాణం బలైపోయింది.  ఖమ్మం జిల్లాకు చెందిన సాయి కిరణ్ మైసమ్మగూడలోని హాస్టల్ లో తన ఫ్రెండ్ ను కలిసేందుకు వచ్చి.. గోడ దూకే క్రమంలో ప్రాణాలను వదిలాడు. ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న సాయి కిరణ్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోగా.. అతని పెదనాన్న అతడి బాగోగులను చూస్తున్నారు. అయితే సాయి కిరణ్ గోడ దూకుతున్న విజువల్స్ హాస్టల్ లోని సిసికెమెరాల విజువల్స్ క్లీయర్ గా జరిగిన ఘటనను రికార్డ్ చేశాయి.

కాగా మూడు అంతస్థుల బిల్డింగ్ ను ఎక్కి దిగడం ఎందుకు అని ఆలోచించిన సాయి కిరణ్, సందీప్ లు గోడ దూకే ప్రయత్నం చేశారు. అయితే సందీప్ గోడ దూకగలిగినా కానీ సాయి కిరణ్ మాత్రం గోడ దూకే క్రమంలో కాలు జారి పడిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించడం జరిగింది. కాగా సాయి కిరణ్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. కాగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హాస్టల్ వార్డెన్, తోటి విద్యార్థులను దీనిమీద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లాకు సాయి కుమార్ మృతదేహాన్ని తరలింపుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హాస్టల్ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ వినిపిస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Kiran  Hyderabad  Hostel  Student died in Hostel  Khammam student died  

Other Articles