ayutha chandi maha yagam starts today with gauri pooja

Kcr and governor families perform gauri pooja at ayutha chandi yagam

Ayutha Chandi Yagam, CM KCR, KCR FArm House, Jagadevpur, MP Kavitha, Governor Narasimhan, telangana, eeravalli, Chandi maha yagna, Gauri Puja, CM KCR, Arrival of celebrities

Telangana chief minister KCR and Governor families performs ayutha chandi yagam in his farm house at eeravalli

ఆయుత చండీయాగంలో గౌరీ పూజను నిర్వహించిన కేసీఆర్ దంపతులు

Posted: 12/23/2015 10:06 AM IST
Kcr and governor families perform gauri pooja at ayutha chandi yagam

లోక కల్యాణం, ప్రజల సుఖశాంతులను ఆకాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు నిర్వహిస్తున్న అయుత చండీ మహాయాగం ఇవాళ ఉదయం గురు ప్రార్థనతో ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు, గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. అంతకు ముందు యాగశాల చుట్టూ సీఎం దంపతులు ప్రదక్షిణలు చేశారు. శృంగేరీ పండితులతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 2 వేల మంది రుత్వికులు యాగంలో పాల్గోంటున్నారు.

ఆరుగురు ప్రధాన రుత్విజుల పర్యవేక్షణలో చండీయాగం నిర్వహణ కొనసాగుతుంది. 108 హోమగుండాలతో పాటు చతుర్వేద యాగశాలల్లో యాగం నిర్వహిస్తున్నారు. శాస్త్ర ప్రమాణంగా నిర్ణయించిన హోమద్రవ్యాలతో యాగం కొనసాగుతుంది. ఇక యాగకర్తలు తప్ప ఇతరులకు యాగశాలలోనికి ప్రవేశం లేదు. పూర్తి నియమ నిష్టలతో రుత్విజులు, యాగకర్తలు యాగం నిర్వహిస్తున్నారు. ఇక ఈ మహత్తర కార్యక్రమంలో వీసమెత్తు అపశ్రుతి దొర్లకుండా, పకడ్బందీగా యాగాన్ని నిర్వహిస్తున్నారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలతోపాటు పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రానుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు యాగాన్ని వీక్షించేందుకు దాదాపు 50 వేల మంది భక్తులు తరలివస్తారని అంచనా. వీరందరికీ సరిపడేలా అమ్మవారి పసుపు కుంకుమ, ప్రసాదంతో పాటు అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది భక్తులు ఒకేసారి ప్రదక్షిణగా వెళ్లి యాగాన్ని వీక్షేంచేలా యాగశాల చుట్టూరా బారికేడ్లతో మార్గాన్ని నిర్మించారు. కాగా ఉదయాన్నే యాగానికి పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరయ్యారు.

యాగంలో ఇవాళ గురుప్రార్థన, గణపతి పూజ, గోపూజ, మహామంటప స్థాపనం, చండీ యంత్రలేఖనం, యంత్ర ప్రతిష్ఠ, దేవతా అవాహనం, ప్రాణప్రతిష్ఠ, నవావరణార్చన, ఏకాదశన్యాస పూర్వక సహస్ర చండీ పారాయణం, పంచబలి, యోగినీబలి, మహారుద్రయాగ సంకల్పం, రాజశ్యామల, మహారుద్ర పురశ్ఛరణ చతుర్వేదయాగ ప్రారంభం, మహాసౌరం, ఉక్తదేవతా జపములు, మంత్రపుష్పం, విశేష నమస్కారములు, కుమారి సువాసిని, దంపతి పూజ, మహా మంగళహారతి, ప్రసాద వితరణం ఉంటాయి. సాయంకాలం కోటి నవాక్షరీ పురశ్ఛరణం, విశేషపూజ ఆశ్లేషబలి, అష్టావధాన సేవ నిర్వహిస్తారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayutha Chandi Yagam  CM KCR  Governor Narasimhan  telangana  eeravalli  

Other Articles