Rajya Sabha passes Juvenile Justice Bill

Rajya sabha passes juvenile justice bill

Juvenile Justice Bill, Rajya Sabha, Rape Case, Nirbhaya Case, Parliament

The Rajya Sabha on Tuesday passed the Juvenile Justice Bill, which will ensure that from now on 16-year-olds involved in heinous crimes will be prosecuted as adults. The bill was taken up against the backdrop of uproar over the release of a juvenile convict in the heinous gang-rape and murder of a 23-year-old girl on December 16, 2012.

మొత్తానికి ఆ చట్టం చేశారు

Posted: 12/23/2015 09:32 AM IST
Rajya sabha passes juvenile justice bill

మూడేళ్లుగా దేశమంతా ఎదురుచూసిన చట్టం ఎట్టకేలకు సాకారమయ్యింది. క్రూరమైన నేరాలకు పాల్పడే బాలలను సైతం పెద్దలతో సమానంగా శిక్షించాలన్న ప్రజల డిమాండ్ సఫలీకృతమైంది. లైంగికదాడి, హత్యలు తదితర క్రూరమైన నేరాలకు పాల్పడిన బాల నేరస్థులు ఆ సమయానికి పదహారేళ్ల వయసు కలిగి ఉంటే సదరు నేరాలకు వయోజనులపై ఎలాంటి విచారణ జరుపుతారో అదే పద్ధతిని బాల నేరస్థులకూ వర్తింపజేస్తారు. ఈ మేరకు ఒక కీలక బిల్లును పార్లమెంటు ఆమోదించింది.

ఇప్పటిదాకా 18 ఏళ్ల వయసున్న వారు నేరాలకు పాల్పడితే బాల నేరస్థులుగా పరిగణిస్తూ వచ్చారు. దీనిని 16 ఏళ్లకు తగ్గించేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు. అంటే పదహారేళ్లు దాటితే వారిని బాల నేరస్థులుగా పరిగణించరు. మూడేళ్ల క్రితం ఢిల్లీలో నిర్భయపై జరిగిన సామూహిక లైంగికదాడి, హత్య కేసులో దోషిగా ఖరారైన ఓ నేరస్థుడికి కేవలం పద్దెనిమిదేళ్ల లోపు వయసున్నదన్న కారణంతో స్వల్ప శిక్ష విధించారు. ఆనాటి భయానక ఘటనలో ఇతర దోషులకు ఉరి శిక్ష విధించారు. కిరాతకంగా వ్యవహరించినట్టు ఆరోపణలున్నా.. వయసు తక్కువ అన్న ఏకైక కారణంతో ఒకడిని బాల నేరస్థుడికింద విచారించి, మూడేళ్ల శిక్షతో సరిపెట్టారు. ఈ నేపథ్యంలో బాల నేరస్థులుగా గుర్తించే వయసును సవరించాలన్న డిమాండ్ ఉవ్వెత్తున ముందుకు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Juvenile Justice Bill  Rajya Sabha  Rape Case  Nirbhaya Case  Parliament  

Other Articles