call money agents makes defaulters scare by abnormal pooja

Call money brokers perform shudra pooja infront of defaulters house

call money agents shudra pooja, call money agents abnormal pooja, call money agents harrasements, abnormal pooja items on defaulters house roofs, AP intelligence failed again, chandrababu, andhrapradesh, Intelligence, intelligence dg venkateshwara rao, ab venkateshwara rao ips, Call money, TDP, YSRCP, congress, JaganMohanreddy, Jagn, Raghuveera Reddy, Chiranjeevi, call money scandal, call money scam

call money agents makes defaulters scare by throwing abnormal pooja items on their house roofs

క్షుద్రపూజలకు తెరలేపుతున్నా కాల నాగులు. భాయాందోళనలో బాధితులు

Posted: 12/22/2015 12:02 PM IST
Call money brokers perform shudra pooja infront of defaulters house

విజయవాడలో ‘కాల్‌ నాగులు’ కొత్త అవతారం ఎత్తారు. కాల్ మనీ కేసులో ఏజెంట్ల, బ్రోకర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనను అపహాస్యం చేస్తూ.. తమ ఆగడాలను అడ్డుకునే వారెవరంటూ అటు ప్రభుత్వానికి, పోలీసులకు సవాల్ విసురుతున్నారు. బాధితుల వద్ద ఆధారాలుంటే.. తనకివ్వాలని చెప్పిన ముఖ్యమంత్రి  చంద్రబాబు రక్షణ వలయాన్ని దాటుకుని వారు అయనను ఎలా కలుస్తారు. ఎలా సాక్షాలను ఇస్తారు.

ఇక మరో దారుణమైన విషయం ఏమిటంటే తమ మానాలు బలవంతంగా తీస్తున్న సాక్షాలు మా వద్ద ఎలా వుంటాయని బాధితులు  త్రీవ అందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో కాల్ నాగులు బాధితుల నుంచి డబ్బు వసూళ్లు చేసేందుకు క్షుద్రావతారం దాల్చాయి. బాకీ తీర్చలేదంటూ తమ కుటుంబంపై క్షుద్ర ప్రయోగం చేస్తున్నారని మచిలీపపట్నానికి చెందిన దేవిక నాగవెంకట రత్నకుమారి వాపోతున్నది. భర్త ఫొటో చూపించి.. ఆయన మూడేళ్లుగా కనిపించకుండాపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.
 
ముగ్గురు బిడ్డలను పోషించడం ఎలాగో తెలియక.. తన బాధల్లో తాను ఉంటే.. ‘నీ భర్త మా దగ్గర అప్పులు చేశాడు’ అంటూ దేసు వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, పుప్పాల వెంకటేశ్వరరావు అలియాస్‌ కన్నెబాబు ఒత్తిడికి దిగారని తెలిపింది. తమకు అప్పు విషయం తెలియదని చెప్పడంతో.. వేధింపులను తీవ్రతరం చేశారని చెప్పింది. ‘‘క్షుద్ర పూజలు చేసి తాళ్లు, పసుపు కుంకుమలు ఇంటిపైకి విసురుతున్నారు. రోడ్డు మీదకొచినప్పుడు వెనుక నుంచి వచ్చి సిగరెట్లతో కాల్చడాలు, రాళ్లతో కొట్టడాలు చేస్తున్నారు’’ అని వాపోయింది.

అయితే అసెంబ్లీ, మండలి సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు అండగా వుంటామని, ప్రకటించడంతో పాటు.. కాల్ మనీ కేసులో ఎవరైనా ఇంటిపైకి వచ్చి డబ్బులను అడిగితే ఇవ్వకండీ అంటూ ప్రకటించారు. ఒకవేళ అలాంటి వారు వస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయండీ అన్న చెప్పిన చంద్రబాబు ఇచ్చిన భరోసా కూడా చెల్లుబాటు కావడం లేదని అమె వాపోయింది. కాల్ మనీ కేటుగాళ్లు  తన ఇంటిపై కన్నేయడం వల్లనే ఇదంతా చేస్తున్నారని. అమె తన బాధను వ్యక్తం చేసింది. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు పిర్యాదు చేస్తే.. వారూ కూడా కాల్ మనీ కేటుగాళ్లకే వత్తాసు పలుకుతుండటంతో దిక్కు తోచక కుమిలిపోతున్నామని దేవిక కన్నీటిపర్యంతమయింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : call money  shudra pooja  abnormal pooja  

Other Articles