case files on call money sex racket culprits demands purandeswari

Call money culprits to be booked under nirbhaya act

purandeswari, bjp leader, Call money sex racket, nirbhaya case, intelligence dg venkateshwara rao, ab venkateshwara rao ips, Call money, TDP, YSRCP, congress, JaganMohanreddy, Jagn, Raghuveera Reddy, Chiranjeevi, call money scandal, call money scam

former union minister, BJP leader demanda state government to book all the cases of call money under nirbhaya act

కాల్ మనీ నిందితులపై నిర్భయ కేసులు నమోదు చేయాలి

Posted: 12/21/2015 10:09 AM IST
Call money culprits to be booked under nirbhaya act

కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరీ ఆదివారం హైదరాబాద్లో స్పందించారు. కాల్మనీ వ్యవహారంలో నిందితులపై నిర్భయ కేసులు నమోదు చేయాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్థిక కష్టాలలో వున్న అమాయక అడపడచులను బలవంతంగా వ్యభిచార రోంపిలోకి దింపిన కామాంధులపై బలత్కారం, అత్యాచరం వీడియో రికార్డింగ్, వ్యభిచారం కేసులను కూడా నమోదు చేయాలని అమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కాల్ మనీ వ్యవహారంపై నిష్పాక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని అమె డిమాండ్ చేశారు.

నిర్భయ కేసులో మైనర్ నిందితుడిని విడుదల చేయకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. అలా చేస్తే ఓ క్రూర మృగాన్ని విడుదల చేసినట్లే అని పురందేశ్వరి తెలిపారు. విజయవాడ నగరంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ కేసులో నిందితులపై వెంటనే చర్యలు చేపట్టాలని వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : purandeswari  bjp leader  Call money sex racket  nirbhaya case  

Other Articles