Venkaiah Naidu questions that why did rally after got bail

Venkaiah naidu questions that why did rally after got bail

Venkaiah Naidu, National Herald Case, Rahul Gandhi, Sonia Gandhi

Central Minister Venkaiah Naidu salms congress Party. He attacked on Sonia gandhi and Rahul Gandhi. He questions how can they did rally after getting bail.

బెయిల్ దొరికితే ర్యాలీలు చేస్తారా..?

Posted: 12/21/2015 10:06 AM IST
Venkaiah naidu questions that why did rally after got bail

నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులుగా కోర్టుకు హాజరైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎంత హడావిడి చేశారో దేశం మొత్తం చూశారు. కాంగ్రెస్ శ్రేణులను ర్యాలీగా దింపిన కాంగ్రెస్ మీద కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. అధికారంలో ఉన్నంత సేపు ప్రజలకు మేలు చేయడం మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నదని వెంకయ్యనాయుడు విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం చట్టసభలను స్తంభింపజేయడం సరికాదని ఆయన సూచించారు.

కోర్టుకు రావాలని నోటీసులు అందితే ర్యాలీలు తీయడం ఎందుకు? అని.. బెయిల్ దొరికిన తర్వాత ర్యాలీలు నిర్వహించి దేశ ప్రజలకు కాంగ్రెస్ ఏం చెప్పదల్చుకున్నది? అని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. కనీసం ర్యాలీలు ఎందుకు తీస్తున్నారో కూడా చెప్పలేని స్థితిలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని అప్రతిష్ఠ పాలుచేసేందుకు పార్లమెంటును అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని వెంకయ్య డిమాండ్ చేశారు. జీఎస్టీ, రియల్ ఎస్టేట్, ఆమోదం పొందాల్సిన ఇతర బిల్లుల విషయంలో అభ్యంతరాలుంటే వ్యక్తం చేయాలే తప్ప.. ప్రతిపక్షాలు సభను స్తంభింపజేయడం సరికాదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkaiah Naidu  National Herald Case  Rahul Gandhi  Sonia Gandhi  

Other Articles