Drunk and Drive : Lady troubles traffic Police at Jubilee hills

Lady troubles traffic police at jubilee hills

Drunk and Drive, Drunk and Drive telangana, drunken lady hulchal, drunken lady hulchal Jubilee Hills, drunken lady hulchal hyderabad, drunken lady traffic police, accident jubilee hills

A drunken lady has made hulchal at Jubilee Hills, road number 45 in Hyderabad. The lady was exposed during the drunk and drive raid being conducted by traffic police.

ITEMVIDEOS: జూబ్లీహిల్స్ లో తాగిన మైకంలో యువతి హల్ చల్..

Posted: 12/21/2015 10:03 AM IST
Lady troubles traffic police at jubilee hills

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, వారి నుంచి గతంలో తప్పించుకున్న వారు అదే ధైర్యంతో పీకల వరకు తాగి, తమ వాహనాలను నడుపుతూ,, తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలకు కూడా ముప్పు తీసుకోస్తున్నారు. ఇప్పటికే పోలీసుల విస్తృత తనిఖీల నేపథ్యంలో తాగి రోడ్డుపైకి రావడానికి సాధారణ జనం జంకుతున్న తరుణంలో..గోప్పింటి బిడ్డలు మాత్రం ప్రతి వారమూ పదుల సంఖ్యలో దొరుకుతుండగా, వారిలో ఒకరిద్దరు యువతులు పట్టుబడుతూనే ఉన్నారు.  నిన్న హైదరాబాద్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న వేళ, కురచ దుస్తులు ధరించి కారులో వచ్చిన యువతి హల్ చల్ చేసింది.

మద్యం సేవించి కారు నడుపుతున్న ఆమెను పోలీసులు పరీక్షించబోగా తొలుత సహకరించ లేదు. ఆపై అతి కష్టం మీద పోలీసులు పరీక్షలు నిర్వహించి, మోతాదుకు మించిన మద్యం సేవించినట్టు తేల్చి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను తప్పించుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులు ప్రమాదానికి గురయ్యారు. టీఎస్ 09 ఈఏ 7848 నంబరుపై వస్తున్న యువకులు, పోలీసులను చూసి తమ బైకును వేగంగా వెనక్కు తిప్పి వెళుతూ డివైడర్ ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ డ్రైవ్ లో 11 కార్లు, 3 బైకులు సీజ్ చేసి 14 మందిపై కేసులు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drunk and Drive  drunken lady  jubilee hills  road no 45  

Other Articles