pawan kalyan to campaign ghmc elections..?

Pawan kalyan to support bjp tdp alliance again in ghmc elections

Pawan Kalyan, GHMC Polls, Jana Sena Party, GHMC poll campaign, TDP-BJP alliance, Telanagana elections, pawan kalyan TDP-BJP alliance, pawan kalyan GHMC elections, pawan kalyan political plan, janasena GHMC elections

Power Star and Jana Sena party founder Pawan Kalyan's nexr political plan is to participate in the campaigning for GHMC election.

ITEMVIDEOS: గ్రేటర్ ఎన్నికలలో ఆ కూటమికి జనసేన అధినేత ప్రచారం

Posted: 12/21/2015 09:50 AM IST
Pawan kalyan to support bjp tdp alliance again in ghmc elections

త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం - బీజేపీలు కలసి పోటీ చేయనుండగా, అభ్యర్థుల తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకోసం 'సర్దార్' చిత్రం షూటింగ్ కు కొద్ది రోజుల పాటు ఆయన విరామం ఇవ్వొచ్చని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. కాగా, తమ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోదని, నిధుల కొరత ఉన్నందునే తామెవరినీ బరిలోకి దించడం లేదని గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించి ఆయన బీజేపి-టీడీపీ కూటమి పక్షాన ప్రచారం నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తానన్న ప్రధాని నరేంద్ర మోడీ.. తెలివిగా ఆ ఆంశంపై నాన్చివేత ధోరణి కోసం నీటి ఆయోగ్ పరిశీలనలో వుంచి.. సుమారు 19 నెలలు కావస్తున్నా.. ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న కారణంగా కొంత ఆలోచనలో పవన్ పడ్డారని సమాచారం. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ అధికార టీడీపీ పార్టీ.. నేతలు కాల్ మనీ లాంటి దారుణమైన నేరాలకు పాల్పడుతుండటం, ల్యాండ్ పుల్లింగ్ విషయంలో తాను పదే పదే విన్నవించినా.. వినిపించుకోకుండా వ్యవహరించడం లాంటి ఘటనలతో పాటు.. బాధిత రైతల సమస్యలను వినేందుకు తాను ఏర్పాటటు చేసిన సభా వేదికపైకి రాయి విసరడం వంటి ఘటనల నేపథ్యంలో ఆ కూటమికి పవన్ మద్దతు ఇవ్వరని కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే తెలంగాణ రాష్ట్రంలో వున్న సీమాంధ్ర ప్రజల శాంతిభద్రతల పరిరక్షణతో పాటు.. అటు ఆడపడచులకు భద్రత కల్పించే ఉద్దేశ్యంలోనే తన రాజకీయ పార్టీకి అంకురార్పన జరిగిందని ఇదివరకే ప్రకటించిన పవన్ కల్యాన్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో కూడా అదే కూటమికి మద్దతునిచ్చి.. ప్రచారాన్ని నిర్వహిస్తారని ఆయన అభిమానుల నుంచి వార్తలు వస్తున్నాయి. మొత్తానికి నూతన సంవత్సరంలో జరగనున్న ఎన్నికలలో పవన్ కల్యాన్ ఎటు వైపు పయనిస్తారో..? తటస్థంగా వుంటారా..? అన్నది వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  GHMC Polls  Jana Sena Party  GHMC poll campaign  TDP-BJP alliance  

Other Articles