YSRCP MLA Roja getting well

Ysrcp mla roja getting well

Roja, Jagan, JaganMohanReddy, Call Money, AP, Assembly, YSRCP, NIMS

YSRCP President Jagan Visitation Roja. Roja suffers with high blood pressure. She admits in NIMS hospital.

ఆస్పత్రిలో కోలుకుంటున్న రోజా

Posted: 12/19/2015 02:00 PM IST
Ysrcp mla roja getting well

అసెంబ్లీ ఆవరణలో వైసీపీ ఎమ్మెల్యే రోజా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఆమె గాయపడ్డారు. పోలీసులు రోజాను అదుపులోకి తీసుకుంటుండగా ఆమె కిందపడిపోయారు. ఇవాళ ఉదయం అసెంబ్లీకి వచ్చిన రోజాను గేటు వద్ద మార్షల్స్ అడ్డుకున్నారు. రోజా అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లేందుకు మార్షల్స్ నిరాకరించారు. దీంతో వైసీసీ ఎమ్మెల్యేలు మార్షల్స్ తో గొడవకు దిగారు. తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని రోజాను బలవంతంగా అసెంబ్లీ ఆవరణం నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారు. తర్వాత పోలీసులు రోజాను నాంపల్లి పీఎస్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తీస్కెళ్లే లోపే ఆమె సొమ్మసిల్లిపోయారు. దీంతో వైద్య పరీక్షల కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఉండగానే రోజాను ఆపార్టీ అధినేత జగన్ పరామర్శించారు.

రోజాకు గత కొంత కాలంగా ఆరోగ్యం బాగోలేదని... అయినా కీలక అంశమైన కాల్ మనీ గురించి మాట్లాడటానికి ఆమె వచ్చిందని సహచర ఎమ్మెల్యేలు వెల్లడించారు. ఆమె బిపి కంట్రోల్ తప్పిందని.. దాంతో తోపులాటలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే జగన్ రోజా పరిస్థితి ప్రస్తుతానికి కుదుటపడుతోందని వెల్లడించారు. గతంలో కూడా తిరుపతి రిమ్స్ లో ామె కొన్నాళ్ల పాటు చికిత్స పొందిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసినంత మాత్రాన కనీసం వైఎస్ఆర్‌సీఎల్పీ కార్యాలయానికి వస్తే తప్పా అని ప్రశ్నించారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న రోజాను పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పరామర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Jagan  JaganMohanReddy  Call Money  AP  Assembly  YSRCP  NIMS  

Other Articles