We will stop assembly sessions YS Jagan told

We will stop assembly sessions ys jagan told

AP, Assembly, Chandrababu, Roja, call Money, Jagan, YSRCP

AP Assembly sessions going very hot. AP Assembly speaker yester day suspended YSRCP MLA Roja for the assembly for one year.

అసెంబ్లీ జరగనివ్వం: జగన్

Posted: 12/19/2015 01:32 PM IST
We will stop assembly sessions ys jagan told

ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ ను ఎత్తివేయకపోతే అసెంబ్లీని జరగనివ్వం అంటూ వైసీపీ శాసనసభా పక్ష నేత వైఎస్ జగన్ హెచ్చరించారు. దేనికైనా తాము రెడీ అన్నారు. కావాలంటే సభ్యులందరినీ సస్పెండ్ చేసుకోండంటూ వ్యాఖ్యానించారు. రోజాను సంవత్సరం పాటు ఏ రూల్ ప్రకారం సస్పెండ్ చేశారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. మీకు లేని అధికారల ఒక మహిళా ఎమ్మెల్యేను సస్పెన్స్ చేయడం సరికాదన్నారు. రోజాను అసెంబ్లీ బయటే ఎందుకు ఆపారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

తమకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పకుండా అడ్డుకుంటామని జగన్ వెల్లడించారు. ఈ అన్యాయాన్ని కచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు. కామా సీఎం అంటూ రోజా చేసిన వ్యాఖ్యలో తప్పేముందన్నారు. కామా అంటే ‘కాల్ మనీ’ అని ఆయన వివరణ ఇచ్చారు. అయితే.. సభను జరగనివ్వం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు తప్పుపట్టారు. ఒక సభ్యుడో, సభ్యురాలి కోసమో సభను జరగనివ్వబోమనడం సరికాదని, ఆ వ్యాఖ్యలను జగన్ సరిదిద్దుకోవాలన్నారు. రోజా సస్పెన్షన్-ను ఏడాది కాలం పాటు కాకుండా, ఈ సమావేశాలకు పరిమితం చేయాలని స్పీకర్-కు విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Assembly  Chandrababu  Roja  call Money  Jagan  YSRCP  

Other Articles