Brazilian Judge Shuts Down WhatsApp

Brazilian judge shuts down whatsapp

whatsapp, social Media, Brazil, Whatsapp Ban, Shut Down Whatsapp

A judge in Sao Paulo has ordered WhatsApp to shut down for 48 hours, starting at 9pm Eastern tonight. WhatsApp is the single most used app in Brazil, with about 93 million users, or 93% of the country’s internet population. It’s a particularly useful service for Brazil’s youth and poor, many who cannot afford to pay the most expensive plans on the planet.

రెండు రోజులు వాట్సాప్ బంద్

Posted: 12/18/2015 01:01 PM IST
Brazilian judge shuts down whatsapp

సోషల్ మీడియా ను వాడకుండా ఉండలేని పరిస్థితి తయారైంది. ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి నిద్రపోయే వరకు సోషల్ మీడియాలో టచ్ లో లేకపోతే చాలా మందికి ఏం చెయ్యాలో తోచకుండా మారింది. అయితే తాజాగా వాట్సాప్ రెండు రోజుల పాటు బంద్ అవుతోంది అన్న వార్త విని చాలా మంది షాక్ అవుతున్నారు. అయితే  ఫీల్ అవ్వాల్సింది మనం కాదులేండి బ్రెజిల్ వాళ్ళు. బ్రెజిల్ లో రెండు రోజుల పాటు వాట్సప్ మెసెంజర్ ను సస్పెండ్ చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో సహకరించడంలో వాట్సప్ అనేకసార్లు విఫలమౌతోందంటూ సావో పాలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు తీర్పుతో రెండు రోజుల పాటు బ్రెజిల్ లో వాట్సప్ సేవలు అందుబాటులో లేకుండా పోనున్నాయి.

వాట్సప్ మెసెంజర్ ను ఫేస్ బుక్ సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బ్రెజిల్ ఇంటర్ నెట్ వినియోగదారుల్లో 93 శాతం మంది వాట్సప్ ను వాడుతున్నారు. ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ కోర్టు తీసుకున్న తీవ్ర నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.'ఇది బ్రెజిల్ కు బాధాకరమైన రోజు, ప్రజల సమాచార రక్షణకు ప్రాధాన్యతనివ్వడం ఫలితంగా ఈ తీర్పు వచ్చింది. బ్రెజిల్ లోని ప్రతి వాట్సప్ వినియోగదారుడిని ఒక జడ్జ్ ఈ నిర్ణయంతో శిక్షించాడు' అని జుకర్ బర్గ్ వాపోయాడు. వాట్సప్ పై రెండురోజుల పాటు సస్పెన్షన్ విధించడం పట్ల బ్రెజిల్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : whatsapp  social Media  Brazil  Whatsapp Ban  Shut Down Whatsapp  

Other Articles