Speaker suspended YSRCP MLA from assembly

Speaker suspended ysrcp mla from assembly

YSRCP, Suspend, Speaker suspend YSRCP MLAs, Jagan, AP, AP Assembly, Call Money, Chandrababu

AP Assembly speaker Kodela Shivaprasad suspended YSRCP MLAs who protesting in the House. Yanamala Ramakrishnudu propose to suspend the MLAs.

జగన్ తో సహా.. వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్సన్

Posted: 12/18/2015 11:27 AM IST
Speaker suspended ysrcp mla from assembly

ఏపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అంబేద్కర్ మీద చర్చ ముగిసే వరకు వారి మీద సస్పెన్షన్ వేటు వేశారు. అయితే దీన్ని నిరసిస్తు.. వైసీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి.. స్సీకర్ మీదకు విసిరేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చెయ్యాలని యనమల రామకృష్ణుడు చేసిన ప్రతిపాదనను సమర్థిస్తూ.. స్పీకర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే జగన్ తో సహా అందరిని బయటకు పంపించడం పై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. కాల్ మనీ మీద చర్చిద్దాం అంటే చాలు ఇలా సస్పెన్షన్ వేటు వేస్తారా అంటూ తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.

సమావేశాల మొదటి రోజు గందరగోళంతో ముగిసింది. కనీసం రెండో రోజైనా సభ సజావుగా సాగుతుందా అని అనుకున్నా అదీ సాగడం లేదు. కాల్ మనీ వ్యవహారం మీద చర్చకు ప్రతిపక్షాలు ఎంత పట్టుపట్టినా కానీ అసెంబ్లీలో అందుకు అవకాశం లభించడం లేదు. దాంతో వారు నిరసనకు దిగారు. కాగా అంబేద్కర్ మీద చర్చ సాగుతున్న సమయంలో ప్రతిపక్షపార్టీ నాయకులు నిరసనకు దిగడంతో వారిని చర్చ ముగిసే వరకు సస్పెండ్ చేశారు. పది నిమిషాల టైం ఇచ్చి.. అంతలోసు సభను ఖాళీ చేయాలని స్పీకర్ గడువు విధించినా కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కొంత మంది స్పీకర్ పోడియం ముందు బైఠాయించి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  Suspend  Speaker suspend YSRCP MLAs  Jagan  AP  AP Assembly  Call Money  Chandrababu  

Other Articles