asking people to add him as facebook friend

Asking people to add him as facebook friend

Facebook, friends, Pakistan, Karachi, Rehan Allahwala, Add friend in facebook

Rehan Allahwala from Karachi found a new way to increase the number of people befriending and following him on Facebook.He put up a billboard on the road asking with his photo and details to his Facebook account, asking people to add him. He wishes to have a million Facebook friends.

నన్ను ఫేస్ బుక్ లో ఫ్రెండ్ గా చేర్చుకోరా' అంటూ ఫ్లెక్సీలు

Posted: 12/16/2015 08:49 AM IST
Asking people to add him as facebook friend

పిచ్చి పలు రకాలు.. కొంత మందికి డ్రెస్సులంటే పిచ్చి.. మరికొందరికి బంగారం అంటే పిచ్చి. మరికొంత మందికి అమ్మాయిలు అంటే పిచ్చి. అయితే ఈ మధ్యన సోషల్ మీడియా పుణ్యమా అని అందరికి ఫేస్ బుక్ పిచ్చి పట్టుకుంది. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా వెంటనే ఫోటో..లేదా సెల్ఫీ దిగడం ఫేస్ బుక్ లో షేర్ చెయ్యడం.. దానికి వచ్చిన కామెంట్లు, లైక్ లు చూసి మురిసిపోవడం మామూలైసపోయింది. అయితే తాజాగా ఓ తెలివిమంతుడు షేస్ బుక్ లో తను ఫ్రెండ్ గా చేర్చుకోవాలంటూ యాడ్స్ ఇచ్చాడు. అవును.. తన ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ లేరని.. ఇలా చేసినట్లు ఆ ప్రబుద్దుడు వెల్లడించారు.

పాకిస్థాన్ లో కరాచీకి చెందిన రెహాన్ అల్లవాలా అనే వ్యక్తి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు. ఎలాగైనా తనకు ఫేస్ బుక్ లో లక్షల్లో స్నేహితులు ఉండాలని కోరుకున్నాడు. బాగా ఆలోచించి 'నన్ను ఫేస్ బుక్ లో ఫ్రెండ్ గా చేర్చుకోరా' అంటూ రహదారిపక్కనే పెద్దపెద్ద హోర్డింగులు ఏర్పాటుచేశాడు. అందులో తన ఫొటోను, ఫేస్ బుక్ ఖాతా వివరాలను అందులో పెట్టి తనను ఫాలో అవ్వాల్సిందిగా, స్నేహితుడిగా చేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. తనకు లక్షల్లో స్నేహితులను పొందాలని ఉందని చెప్పాడు. అయినా పిచ్చి పీక్స్ లో ఉంటే పరిస్థితి మరి ఇలానే ఉంటుందేమో.. పాపం మరి ఆయనకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ ఇలాగానై దొరుకుతారేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  friends  Pakistan  Karachi  Rehan Allahwala  Add friend in facebook  

Other Articles