In Gandhi Hospital a lady kidnaped baby

In gandhi hospital a lady kidnaped baby

Gandhi Hospital, Hyderabad, Baby Kidnap, Kidnap in Gandhi Hospital

In Hyderabad, Gandhi Hospital a lady kidnaped newly born baby with in 15 min after birth. Auto Drivers caught her and informed to police.

గాంధీ ఆస్పత్రిలో పుట్టిన 15 నిమిషాల్లో బిడ్డ కిడ్నాప్

Posted: 12/16/2015 08:48 AM IST
In gandhi hospital a lady kidnaped baby

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో అర్ధరాత్రి కలకలం రేగింది. బిడ్డ పుట్టిన 15 నిమిషాల్లోనే ఆ పసిగుడ్డును మాయం చేసేసిందో కిలాడి. ఏకంగా ఐసీయూలోకి వెళ్లి పసిబిడ్డను ఎత్తుకుని పారిపోయింది. అయితే ఆటో డ్రైవర్లు చాకచక్యంగా కిడ్నాపర్ పట్టుబడింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ కు చెందిన జ్యోతికి నొప్పులు రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి సమయంలో జ్యోతి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె స్పృహలేని స్థితిలో ఉండగా జ్యోతి భర్త తేజ బ్లడ్ కోసం అదే ఆస్పత్రిలోని మరో ఫ్లోర్ కి వెళ్లాడు. ఈ గ్యాప్ లోనే పసిబిడ్డను ఎత్తుకుని పారిపోయింది మేరీ అనే మహిళ.

దుప్పట్లో పసిబిడ్డను ఎత్తుకుని బయటకు వచ్చిన మేరీ రామకృష్ణాపురం వెళ్లడానికి ఆటో మాట్లాడుతుండగా ఆటో డ్రైవర్లు విషయాన్ని పసిగట్టారు. పోలీసులకు, ఆస్పత్రి వర్గాలకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆస్పత్రి సెక్యూరిటీ అలర్ట్ అయింది. పసిబిడ్డను ఎత్తుకుని పారిపోబోయిన మేరీని పట్టుకుని ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. దీంతో మేరీని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ మధ్యన ఆస్పత్రుల్లో చిన్న పిల్లల కిడ్నాప్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఆస్పత్రుల్లో నిఘా కొరత కిడ్నాపర్లకు వరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gandhi Hospital  Hyderabad  Baby Kidnap  Kidnap in Gandhi Hospital  

Other Articles