PM Modi Not Linked To CBI Raid At Kejriwal's Office: Venkaiah Naidu

Fashion for kejriwal to quarrel with centre venkaiah naidu

arvind kejriwal, venkaiah naidu, delhi principal secretary, cbi, delhi, kejriwal office, rajendra prasad delhi arvind kejriwal vs centre,Arvind Kejriwal,Arvind Kejriwal vs PM Modi,kejriwals office raided,Kejriwals office sealed, cbi, kejriwal cbi raid, cbi raid in kejriwal office, aap, aam aadmi party, bjp,

Union Minister Venkaiah Naidu has said neither Prime Minister Modi nor the government of India has anything to do with the CBI raids at Delhi Chief Minister Arvind Kejriwal's house.

ప్రధానికి ముడిపెట్టకపోతే పోద్దు గడవదా..? కేజ్రీకి ఇది ఫ్యాషన్ గా మారింది

Posted: 12/15/2015 11:40 AM IST
Fashion for kejriwal to quarrel with centre venkaiah naidu

ఢిల్లీ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ప్రతి అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ముడిపెట్టకపోతే పోద్దు గడవడం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మండిపడ్డారు. పదే పదే కేంద్రప్రభుత్వంతో కొట్లాడటం, ప్రతి విషయానికీ ప్రధానమంత్రి పేరు ప్రస్తావించడం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఫ్యాషనైపోయిందని అగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సచివాలయంలో ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంలో సీబీఐ సోదాలు జరపడంపై ప్రధానిని విమర్శిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేయడంతో వెంకయ్యనాయుడు స్పందించారు.

సీబీఐ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడంలేదని, అలా పనిచేసే రోజులు కాంగ్రెస్‌తోనే పోయాయని ఆయన అన్నారు. ఇప్పుడు సీబీఐ ఒక స్వతంత్ర సంస్థ అని, ప్రభుత్వం అందులో ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని ఎలా విమర్శిస్తారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో ప్రధానికి ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. కాగా, ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజేంద్ర కుమార్ పై తాము కేసు నమోదు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు వివరించాయి. గత కొన్నేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వ శాఖలకు చెందిన టెండర్లన్నింటినీ ఒకే సంస్థకు కేటాయించడం ద్వారా వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తున్నారని, దీనిపై తాము వారంట్లు తీసుకుని ఆయన కార్యాలయం, ఇళ్లపై సోదాలు చేస్తున్నామని సీబీఐ తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  venkaiah naidu  delhi principal secretary  cbi  delhi  kejriwal office  

Other Articles