Humiliation for Rahul and Kejriwal

Humiliation for rahul and kejriwal

Delhi, Kejriwal, Rahul Gandhi, Modi, delhi demolition, Shakurbasti area

Two days after a six-month-old girl's death during a demolition drive in west Delhi's Shakurbasti area triggered a political slugfest, police on Monday registered a case of negligence against unknown persons on the basis of a statement by the girl's father. In his statement the father has said the girl died much before the drive began.

రాహుల్, కేజ్రీవాల్ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు..?

Posted: 12/15/2015 11:55 AM IST
Humiliation for rahul and kejriwal

ప్రతిదానికి ప్రధాని నరేంద్ర మోదీ మీద నిందలు వెయ్యడం.. అవకాశం దొరికింది కదా అని విమర్శలు చెయ్యడం రాజకీయాల్లో అందునా రాహుల్ గాంధీకి, కేజ్రీవాల్ కు మామూలైపోయింది. దిల్లీ సిఎంగా ఉన్న కేజ్రీవాల్ అవకాశం వస్తే చాలా ప్రధాని మీద విమర్శలకు దిగుతారు. ఇక ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. దిల్లీలో చలి తీవ్రత పెరిగింది అంటే కూడా మోదీనే కారణం అని అంటారేమో..? ప్రస్తుతం పరిస్థితి అలానే ఉంది. రైల్వే పనుల కోసం నిర్వహించన పాత, అక్రమ నిర్మాణాలను తొలగించే క్రమంలో  శిధిలాల క్రిందపడి ఓ చిన్నారి చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.

Also Read: నరేంద్ర మోదీ ఓడిపోతున్నారు

దిల్లీలో జరిగిన దుర్ఘటన మీద రాజకీయంగా తీవ్ర దుమారమే రేగింది. రైల్వే అధికారుల నిర్వాహకుల కారణంగానే చిన్నారి చనిపోయిందని.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పరోక్షంగా ప్రధాని మోదీని టార్గెట్ గా చేస్తూ రాహుల్ విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా చిన్నారి చావుకు తాము కారణం కాదని రైల్వే మంత్రి ప్రకటించారు. అలాగే భవనాల తొలగింపు, కూల్చివేత మొదలుకాక ముందే చిన్నారి మృతి చెందిందని ఆ చిన్నారి తండ్రి పోలీసులకు వెల్లడించారు. దాంతో రాహుల్, కేజ్రీవాల్ కు పరాభవం ఎదురైంది. నోటికి వచ్చినట్లు మాట్లాడటం కన్నా.. ఆలస్యంగా అయినా ఆచితూచి మాట్లాడటం బెటర్ అని పాపం వీళ్లు ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో..?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Kejriwal  Rahul Gandhi  Modi  delhi demolition  Shakurbasti area  

Other Articles