Modi said sorry to kerala not visiting the state

Modi said sorry to kerala not visiting the state

Modi, Kerala, Narendra Modi, Kerala, Kerala BJP, oommen chandy, Rahul Gandhi

Prime Minister Narendra Modi on Monday asserted that BJP has emerged as the "third force" in Kerala that will replace the two fronts led by Congress and CPI(M) in the next year's Assembly elections and transform the state's fortunes.

కేరళ ప్రజలకు మోదీ క్షమాపణలు

Posted: 12/15/2015 08:29 AM IST
Modi said sorry to kerala not visiting the state

రాహుల్ గాంధీ పంతం నెగ్గిందో లేదంటే మోదీ కాస్త తగ్గారో లేదో తెలియదు కానీ తాజాగా మోదీ కేరళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 19 నెలల తర్వాత గానీ కేరళ రాష్ట్రానికి రాలేకపోయానని, అందుకే కేరళకు క్షమాపణలు చెబుతున్నానని నరేంద్ర మోదీ అన్నారు. కేరళలో బీజేపీ దారుణమైన రాజకీయ హింసను ఎదుర్కొన్నదన్నారు. 'దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళలో భారతీయ జనతాపార్టీ ఘోర రాజకీయ హింసను ఎదుర్కొందని... ఇతర పార్టీల చేతుల్లో వందలాది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరులకు నివాళులర్పిస్తున్నానని అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కార్యకర్తల కృషితో కేరళలో బీజేపీకి ఆదరణ పెరిగింది. ప్రజలు మన పట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ప్రకృతి అందాలకే కాక, మానవ వనరులకూ నిలయంగా ఉన్న కేరళ నుంచి లక్షలాది యువత ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో తమ ప్రతిభ చాటుకుంటున్నదని, తన విదేశీ పర్యటనల సందర్భంలో కేరళ ఎన్నారైలతో ముచ్చటించిన విషయాలను మోదీ గుర్తు చేసుకున్నారు. విదేశాల్లో కేరళీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ దేశాధినేతలతో మాట్లాడి పరిష్కరించేందుకు ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తున్నదనన్నారు. కేరళ యువశక్తి, వారి ప్రతిభాపాటవాలు తాము తలపెట్టిన 'మేక్ ఇన్ ఇండియా'ను ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదని ప్రధాని అన్నారు. కేరళలో మత్యకారుల అభివృద్ధి కోసం త్వరలో భారీ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా కేరళలోని 2.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2100 కోట్లు సమకూర్చినట్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Kerala  Narendra Modi  Kerala  Kerala BJP  oommen chandy  Rahul Gandhi  

Other Articles