minors held in lucknow sex racket

Sex racket busted in lucknow

sex racket in lucknow, sex crime in lucknow, sex crime in uttar pradesh, prostitution, crime in lucknow, Minors, student, sexrocket, lucknow, uttarpradesh

minors held in sex racket busted in lucknow, minor girls as prostitutes and minor boys as sex trade organisers

లక్నోలో వెలుగుచూసిన ఘోరం.. సెక్స్ రాకెట్ లో మైనర్లు..

Posted: 12/14/2015 07:33 PM IST
Sex racket busted in lucknow

ముఖాల్లో పసితనం... చేసే పనులు మహా ఘోరం, నీచం. అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అమాయకులను వీళ్లు వేధిస్తున్న తీరును తెలుసుకుని పోలీసులు కూడా అవాక్కవుతున్నారు. అందుకే ఇటువంటివారిని వారి వయసును బట్టి మైనర్లని అనడం పొరపాటేనేమో అనిపిస్తుంది. వీరికోసం చట్టాన్నైనా సవరించాలి లేదా చెడుదారి పట్టకుండా తగిన సంస్కరణ మార్గాలను ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
 
దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే... పాఠశాల విద్యార్థులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు యూపీలో ఇటీవలే వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు మైనర్లు సామూహిక అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. నిందితులంతా విద్యార్థులు, మైనర్లే. బాధితురాలు తెలిపిన వివరాలు విన్న నౌచంద్ పోలీసులు షాక్ తిన్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుంటూ, మాయ మాటలతో లోబరచుకొని, మత్తు మందులు ఇచ్చి, సామూహికంగా అత్యాచారాలు చేస్తున్నారని ఆ బాలిక చెప్పింది.
 
ఈ దుర్మార్గులు ఇతర పాఠశాలల విద్యార్థినులను కూడా లోబరచుకుంటున్నారని తెలిపింది. నిందితులకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. బాలలు ఇటువంటి నేరాలకు బాధితులు కావడంపై బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై ప్రశ్నిస్తానని చెప్పారు. బాధితురాలి తల్లిదండ్రులను కలిసి, వారికి అండగా ఉంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minors  student  sexrocket  lucknow  uttarpradesh  

Other Articles