PM Narendra Modi and Rahul Gandhi shake hands at Sharad Pawar's birthday function

Pm narendra modi and rahul gandhi shake hands at sharad pawar s birthday function

Rahul Gandhi, Modi, Sharad Pawar, Delhi, Rahul Gandhi, Modi shakehands, Sharad Pawars Birth day

tting aside their bitterness, both within and outside Parliament, Prime Minister Narendra Modi and Congress vice-president Rahul Gandhi shook hands at a function to felicitate NCP supremo Sharad Pawar.

ITEMVIDEOS: మోదీ, రాహుల్ గాంధీలు కలిసిపోయారు

Posted: 12/11/2015 11:07 AM IST
Pm narendra modi and rahul gandhi shake hands at sharad pawar s birthday function

ఇద్దరు భిన్న ధృవాల్లాంటి వాళ్లు.. ఒకరి మీద ఒకరు పార్లమెంట్ సాక్షిగా దుమ్మెత్తిపోసుకుంటారు.. వీలు దొరికితే విమర్శలు గుప్పించుకోవడం.. దాని దమీద దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. అయితే అలా భిన్న దృవాల్లాంటి వాళ్లు ఒకరినొకరు పలకరించుకోవడమే కాకుండా.. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు. ఎవరా ఇద్దరు నేతలు అని అనుకుంటున్నారా...? కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, ప్రధాని మోదీలు. దిల్లీ వేదికగా రాహుల్ గాంధీ, మోదీలు ఇలా విభేదాలు వదిలి.. ఒకరితో మరొకరు కలిసిపోయినట్లు సీన్ కనిపించింది.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం సందర్భంగా నిన్న దేశ రాజధానిలో కనీవినీ ఎరుగని అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకునే రాజకీయ ప్రత్యర్థులైన మోదీ, రాహుల్ గాంధీల మధ్య కరచాలనాలు, ఆత్మీయ ఆలింగనాలకు పవార్ బర్త్ డే వేడుక వేదికైంది. మనమెప్పుడూ చూడలేమనుకున్న దృశ్యాలు కూడా ఈ వేదికపై కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చిన మోదీ, అక్కడి వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక తన వద్దకు వచ్చిన మోదీకి రెండు చేతులు జోడించి మరీ రాహుల్ గాంధీ నమస్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Modi  Sharad Pawar  Delhi  Rahul Gandhi  Modi shakehands  Sharad Pawars Birth day  

Other Articles