Power cuts to Kamal Hassan

Power cuts to kamal hassan

kamal Hassan, Tamilnadu, jayalalitha, Chennai, Floods, Kamal Hassan on Tamilnadu govt

Kamal Hassan gave contraversial statements on Tamilnadu govt. he said that Tamilnadu govt failed to help the chennai flood victims. After some days he is facing troubles.

కమల్ హాసన్ ఇంటికి కరెంట్ కట్.. కారణం ఆమె..!

Posted: 12/11/2015 08:26 AM IST
Power cuts to kamal hassan

ఇంటికి కరెంటు కట్ చేసినట్లు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. వరద బాధితులను ఆదుకోండి అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేయడం పట్ల కమల్ విమర్శలు చేశారు. పన్నుల రూపేణ ప్రజలు చెల్లిస్తున్న డబ్బు ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. అయితే కమల్ చేసిన విమర్శ ప్రజల్లోనూ, అధికార అన్నాడీఎంకేలో కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి ఓ.పన్నీర్ సెల్వం ఏకంగా ఆరు పేజీల బహిరంగ ప్రకటనతో కమల్‌-పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు కమల్ హాసన్ ఇల్లు, కార్యాలయం ఉన్న ఆళ్వార్‌-పేట ఎల్డామ్స్ రోడ్డులో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

జయ సర్కార్-ను తాను బహిరంగంగా విమర్శించలేదని, ఒక మీడియా మిత్రునికి ఈ- మెయిల్ మాత్రమే ఇచ్చానని 7వ తేదీన కమల్ వివరణ ఇచ్చుకోవడంతో పాటు క్షమాపణ కూడా కోరారు. ఆ మరుసటి రోజే అధికారులు కమల్ హాసన్ ఇంటికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కమల్‌-పై కక్ష సాధించేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, పెద్దల రాజకీయాలకు తాము ఇబ్బంది పడ్డామని ఆళ్వార్-పేట వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కమల్ హాసన్ కు తమిలనాడు ముఖ్యమంత్రికి మధ్య ఎన్నాళ్ల నుండో వివాదం నడుస్తోంది. గతంలో కమల్ హాసన్ విశ్వరూపం విడుదలను అడ్డుకున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా మరోసారి వీరిద్దరి విభేదాలు తారా స్థాయికి చేరినట్లు కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal Hassan  Tamilnadu  jayalalitha  Chennai  Floods  Kamal Hassan on Tamilnadu govt  

Other Articles