Chandrababu calls TDP followers, his extended family

Chandrababu stop convoy to reach out tdp follower chandraiah

Chandrababu Naidu, Jana Chaitanya Yatra, Telugu Desam Party, TDP, AP Government, Chandraiah, TDP follower, Chandrababu extended family

AP CM Chandrababu stops convoy steps down and comes back walking for the sake of his party follower chandraiah, after passing him.

చంద్రయ్య కోసం కారు దిగి నడిచివెళ్లిన చంద్రబాబు..!

Posted: 12/08/2015 12:32 PM IST
Chandrababu stop convoy to reach out tdp follower chandraiah

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని అయన చెప్పడమే మనకు తెలిసిందే. కానీ అందులో నిజమెంత అంటే మైసూర్ బోండాలో మైసూర్ అంత, నేతి బీర లో నెయ్యంతా అని మాత్రం చెప్పడం తప్పే అవుతుంది. ఎందుకంటే పార్టీ నేతలు, కార్యకర్తలంటే బాబుగారికి అంత ప్రేమ. అప్యాయత. వారి కోసం తాను ఏం చేయమన్నా చేస్తాడు. ఇదే విజయాన్ని నిన్న జనచైతన్య యాత్రలలో భాగంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యటనలో కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు తమ పార్టీ బలమని చెప్పుకోచ్చారు. ఎంతలా అంటే తమ కార్యకర్త అని తెలిస్తే చాలు కారును నిలిపేసి మారీ నడుచుకుంటూ వచ్చి వారితో మాట్లాడుతారు. నమ్మశక్యంగా లేదా..? అయితే ఈ సంఘటన మీకు తెలియాల్సిందే..

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు హైదరాబాదులోని తన ఇంటి నుంచి చంద్రబాబు బయలుదేరిన తరువాత ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అదేమిటంటే.. చంద్రబాబు తన కాన్వాయ్ లో ఇంటి నుంచి బయలుదేరి రోడ్డుపైకి చేరుకునే క్రమంలో అక్కడి ఫుట్ పాత్ పై చంద్రయ్య అనే పార్టీ కార్యకర్త కనిపించారు. అప్పటికే చంద్రబాబు కాన్వాయ్ ఆయనను దాటేసుకుని ముందుకెళ్లిపోయింది. అయితే చంద్రబాబు తన కాన్వాయ్ ను ఆపేసి, అక్కడే కారు దిగి వెనక్కి నడిచి వచ్చారు. చంద్రబాబు తనకోసం వెనక్కి వస్తున్న వైనాన్ని చూసిన చంద్రయ్య పరుగు పరుగున ముందుకు వెళ్లారు. చంద్రబాబు కాళ్లకు నమస్కారం చేశారు. చంద్రయ్యను ఆప్యాయంగా పైకి లేపిన చంద్రబాబు ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడారు. దీంతో చంద్రయ్య పులకించి పోయారు. ఆ తర్వాత చంద్రబాబు కాన్వాయ్ వద్దకెళ్లి కారులో ఎక్కి వెళ్లిపోయారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Chandraiah  TDP follower  Jana Chaitanya Yatra  

Other Articles