Rahane rescues India after Piedt shines

India frustrate sa in delhi

live cricket score, live score cricket, cricket live score, india vs south africa live, live ind vs sa, ind vs sa live, live ind vs sa, india south africa live, ind vs sa 4th test live score, ind vs south africa 4th test live score, ind vs sa 4th test match live score, india south africa 4th test live score, india south africa 4th test live score, south africa, india, fourth test, ajinkya rahane, ravichandran ashwin

India take on South Africa on Day 2 of the fourth Test match at Feroz Shah Kotla in New Delhi on Friday

రాణించిన రహానే.. భారత్ 337 పరుగులకు అలౌట్..

Posted: 12/04/2015 12:10 PM IST
India frustrate sa in delhi

దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో భారత్..  ఈ సిరీస్ లో తొలిసారి మూడొందలకుపైగా పరుగులు నమోదు చేసింది. ఒక ఇన్నింగ్స్ లో ఆటగాళ్లను ఆలౌట్ చేయడానికి దాదాపు రోజున్నర పట్టడం అంతా కూడా చిత్రంగానే అనిపిస్తోంది.  గత మ్యాచ్ ల్లో మూడు రోజులు ఆట మాత్రమే చూసిన సగటు క్రికెట్ అభిమాని అయ్యో అప్పుడే అయిపోయిందా అన్న భావనకు లోనయ్యాడు. ఇక సఫారీల విషయానికొస్తే...  హమ్మయ్యా ! టీమిండియాను ఎట్టకేలకు ఆలౌట్ చేశామని సంబరపడుతోంది.

ఢిల్లీ:  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 117.5 ఓవర్లలో 334 పరుగులను సాధించింది.  231/7 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియా మరో వందకు(103) పైగా పరుగులను సాధించి మిగతా వికెట్లను కోల్పోయింది.  దీంతో టీమిండియా మానసికంగా ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. అజింక్యా రహానే(127; 215 బంతుల్లో  11 ఫోర్లు, 4 సిక్సర్లు) తో అద్భుత సెంచరీ చేశాడు.  లంచ్ విరామ సమాయానికి ఒక వికెట్ ను మాత్రమే కోల్పోయి, మరో 95 పరుగులను జత చేసిన టీమిండియా.. ఆ తరువాత  స్వల్ప వ్యవధిలో  ఆలౌటయ్యింది.

రహానే-అశ్విన్ ల జోడి సఫారీ బౌలర్లకు మరింత పరీక్షగా నిలిచింది. ఈ జోడి ఎనిమిదో వికెట్ కు 98 పరుగుల కీలక భాగస్వామ్యాన్నినెలకొల్పడంతో టీమిండియా ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో సఫారీలపై మొదటి శతకాన్ని, భారత్ లో తొలి సెంచరీని సాధించిన రహానే..  తన దూకుడును మరింత పెంచాడు.  డేన్ పీడిట్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు సాధించి మంచి ఊపులో కనిపించాడు. అయితే రహానే సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత మరో  27 పరుగులు చేసి ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు.

ఆ తరువాత అశ్విన్(56; 140 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు.  ఉమేష్ యాదవ్(10నాటౌట్) తో కలిసి అశ్విన్ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 334 పరుగుల వద్ద అశ్విన్ తొమ్మిదో వికెట్ గా అవుటవ్వగా, వెంటనే ఇషాంత్ శర్మ డకౌట్ పెవిలియన్ కు చేరడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్ కు ఐదు వికెట్లు సాధించగా, డేన్ పీడిట్ కు నాలుగు వికెట్లు, తాహీర్ కు ఒక వికెట్ దక్కాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south africa  india  fourth test  ajinkya rahane  ravichandran ashwin  

Other Articles