Chennai getting help from all sides

Chennai getting help from all sides

Chennai, Chennai Floods, Floods, Tamilnadu, Jayalalitha, Social Media support to Chennai, Helpchennai

Chennai effected from floods from almost one week. The social media and startups giving helping hand to the city.

సహాయానికి సిద్దం: చెన్నైకి అండగా అన్నీ ఉండగా..

Posted: 12/04/2015 02:51 PM IST
Chennai getting help from all sides

చెన్నైలో పరిస్థితి దారుణంగా మారింది. అక్కడి పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. 20 రోజుల కిందట తుపానుతో ప్రారంభమైన వరుణుడి ప్రతాపం... ఇప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో... ప్రజల బాధలు వర్ణనాతీతం. నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలన్నీ రంగంలోకి దిగినా... బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకే తోడ్పడతాయి. కానీ, బాధితులకు కల్పించాల్సిన సౌకర్యాల మాటేమిటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతుండడంతో... అక్కడక్కడ బాధితుల కష్టాలు తీరుతున్నాయి. కానీ, ఇప్పటికీ నాలుగైదు అడుగుల లోతు నీటిలో మునిగిన కాలనీలు, శివారు ప్రాంతాల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు...తమవంతు సహకారం అందించేందుకు సిద్ధమయ్యాయి.. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, స్టార్టప్ కంపెనీలు.

chennai-floods-01
chennai-floods-02
chennai-floods-03
chennai-floods-04
chennai-floods-05
chennai-floods-06
chennai-floods-07

20 రోజుల కిందట తుపానుతో ప్రారంభమైన వరుణుడి ప్రతాపం... ఇప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో... ప్రజల బాధలు వర్ణనాతీతం. నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలన్నీ రంగంలోకి దిగినా... బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకే తోడ్పడతాయి. కానీ, బాధితులకు కల్పించాల్సిన సౌకర్యాల మాటేమిటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతుండడంతో... అక్కడక్కడ బాధితుల కష్టాలు తీరుతున్నాయి. కానీ, ఇప్పటికీ నాలుగైదు అడుగుల లోతు నీటిలో మునిగిన కాలనీలు, శివారు ప్రాంతాల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు...తమవంతు సహకారం అందించేందుకు సిద్ధమయ్యాయి.. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, స్టార్టప్ కంపెనీలు.

NDRF

వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నై వాసులకు ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ... ఫేస్ బుక్ బాసటగా నిలిచింది. తమ వారి క్షేమ సమాచారం గురించి బంధువులు, స్నేహితులు ఆందోళన చెందకుండా చెన్నై వాసుల స్టేటస్ ను తెలిపేలా సేఫ్టీ చెక్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ తో చెన్నై వాసుల యూజర్ పేజీలో సేఫ్టీ చెక్ ఆప్షన్ వస్తుంది. దీనిలో సేఫ్ గా ఉన్నామని చెబుతూ క్లిక్ చేయడం ద్వారా ఆ సమాచారం బంధువులు, స్నేహితులకు ఆటోమేటిక్ గా చేరిపోతుంది. ఇటీవల ప్యారిస్ దాడుల నేపథ్యంలో కూడా ఫేస్ బుక్ ఈ సదుపాయాన్ని కల్పించింది.

facebook

ఇక ఉబర్ క్యాబ్స్ కూడా బాధితుల కోసం రెండు రోజుల పాటు ఫ్రీగా రవాణా సదుపాయం కల్పించింది. కార్లు అద్దెకిచ్చే జూమ్ కార్ కంపెనీ అయితే... తమ వాహనాలను ఫస్ట్ ఎయిడ్ కోసం ఉపయోగించింది. బాధితులను ఆస్పత్రుల్లో చేరవేసేందుకు సహకరించింది. పేటీఎం కంపెనీ 18001030033 అనే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసిన వారికి...30రూపాయల రీఛార్జి కార్డ్ ఏరేంజ్ చేసింది. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ తీసుకుంటున్న జొమాటో యాప్ కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది. చెన్నైలో బాధితులకు ఒక భోజనం ఆర్డర్ చేస్తే... మరో భోజనం ఉచితంగా అందించే ఏర్పాటు చేసింది. చెన్నైలో ఎన్జీఓతో కలిసి పని చేస్తూ... ఆర్డర్ ఇచ్చిన అర గంటలో... రెండు భోజనాలు వరద బాధితులకు చేరవేస్తుంది.

zomato

చెన్నైలో ఇప్పటికీ...సాయం అందని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. నిత్యావసరాల్లేక అల్లాడుతున్నారు బాధితులంతా. వీరి కోసం బిగ్ బాస్కెట్ డాట్ కామ్.... నమ్మ చెన్నై రిలీఫ్ పేరుతో సరుకులు అందించే సదుపాయం కల్పించింది. దాతలు ముందుకొచ్చి విరాళం ప్రకటిస్తే, బాధితులకు సరుకులు అందించే ఏర్పాటు చేసింది...బిగ్ బాస్కెట్ డాట్ కామ్.  స్టార్టప్ కంపెనీలే కాదు... అనేక స్వచ్ఛంద సంస్థలు, బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో బిజీగా ఉన్నాయి. ప్రకృతి ప్రకోపానికి... జలసంద్రమైన చెన్నైలో బాధితులను ఆదుకోవాలంటే.. ప్రభుత్వాలే కాదు, సామాన్య పౌరులు కూడా ఉదారంగా వ్యవహరించాలి.

bigbasket

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai  Chennai Floods  Floods  Tamilnadu  Jayalalitha  Social Media support to Chennai  Helpchennai  

Other Articles