Some relief for flooded Chennai as rain takes a break

Rains stop in chennai life still difficult

Chennai floods, northeast monsoon fury in Tamil Nadu, Tamil Nadu floods,India, Tamil Nadu, Tamil Nadu, Chennai, natural disasters, floods, chennai rains, kerala assembly, chennai flood relief, tamil nadu floods, chennai rescue work, floods rescue work, chennai latest news

The break in rains resulted in a sharp fall in the discharge of waters from Chembarapakkam, Pondi and Puzhal lakes leading to reduction in the water levels.

వర్షం తగ్గడంతో ఊపిరి.. నిత్యవసరాల కోనుగోళ్లో దోపిడీ..

Posted: 12/04/2015 10:56 AM IST
Rains stop in chennai life still difficult

పది రోజులుగా ఏకధాటిగా కురిసని వర్షం నుంచి చెన్నపురి మహానగరం ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. ఇవాళ వర్షం కురవకపోవడంతో. చెన్నపురి వాసులు మెల్లగా తేరుకుంటున్నారు . భారీ వర్షాలు, వరదలతో ముంచెత్తిన మహానగరాన్ని సాగరంలా తలపించేలా చేసిన వరుణుడు ఎట్టకేలకు కాస్త శాంతించాడు. దీంతో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అవకాశం దొరికినట్లయింది. రవాణా సౌకర్యాలకు ఎలాగో ప్రస్తుతం అవకాశం లేకపోయినప్పటికీ వాయు మార్గాలను పునరుద్ధరించే చర్యలను వేగవంతం చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా మూతపడిన విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభమవుతున్నాయి. అరక్కోణం నుంచి పూర్తి స్థాయిలో కాకున్నా కొద్ది స్థాయిలో ఓ ఏడు విమాన సర్వీసులను ప్రైవేటు విమానాల ద్వారా అందించేందుకు ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది.  

జాతీయ విపత్తు దళం కూడా తన సహాయక చర్యలను వేగవంతం చేసింది. చెన్నైకి మరో రెండు యుద్ధ నౌకలు చేరుకున్నాయి. వీటిలో 30 టన్నుల ఆహార పదార్ధాలు, తాగు నీరు తెప్పించారు. మరోపక్క, రేపటి వరకు అన్ని రైళ్లను దక్షిణమద్య రైల్వే రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిమట్టం తగ్గిపోతున్నప్పటికీ మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చెన్నైవాసుల్లో ఇంకా భయాందోళనలు రేకెత్తుతూనే వున్నాయి.

వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా.. వరద నీరు మొదటి అంతస్థు స్థాయిలో పలు చోట్ల ప్రపహిస్తుండటంలో నిత్యావసర సరుకులను విక్రయిస్తున్న వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మానవతతో స్పందించాల్సిన ప్రస్తుత తరుణంలో బాధితుల నుంచి అందినకాడికి దోపిడి చేస్తున్నారు. దీంతో చెన్నైలో గుక్కెడు నీళ్లు, అవసరమైన పాలు కూడా దొరకక అల్లాడుతున్నారు. లీటర్ పాల ధర 100 రూపాయల నుంచి 150 రూపాయలకు అమ్ముతున్నారు. అలాగే 25 లీటర్ల వాటర్ క్యాన్ ను 250 రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇక నిత్యావసర వస్తువులు, పెట్రోలు వంటి వాటి ధరలకు రెక్కలొచ్చాయని ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదని బాధితులు పేర్కొంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : heavy rains  chennai  air services  restarts  essential commondities  

Other Articles