RSS People are homosexuals

Rss people are homosexuals

RSS, homosexuals, Azam Khan, Uttarpradesh, Amir Khan, Azam Khan contraversial statments, Azam Khan News

Samajwadi Party leader and Uttar Pradesh Minister Azam Khan has triggered a fresh controversy with his remarks on homosexuality. According to a report in Nai Dunia, the loudmouth SP leader, while commenting on the contentious issue of homosexuality, said that the Rashtriya Swayamsevak Sangh (RSS) members are like that (homosexuals). Driving his point home, Khan maintained ''this is the reason why the RSS people don't marry.''

ఆర్ఎస్ఎస్ వాళ్లు హోమోసెక్సువల్స్: ఆజంఖాన్

Posted: 12/01/2015 08:56 AM IST
Rss people are homosexuals

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న ఆజం ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆర్ఎస్ఎస్ వారిని టార్గెట్ గా చేసి వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ వారు హోమో సెక్సువల్స్ అని అందుకే వారు పెళ్లిళ్లు చేసుకోరని అన్నారు. గతంలో కూడా ఆజంఖాన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆడవారికి మగవారితో సమానం అయ్యే అవకాశాలు లేవని.. వారు కేవల పిల్లలను కనడానికి మాత్రమే పనికి వస్తారని అన్న ఇమామ్ సయ్యద్ బుఖారీని ఆర్ఎస్ఎస్ ఏజెంట్ గా అభివర్ణించారు. ఆజంఖాన్ మాట్లాడిన ప్రతి సారి ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ గా చేస్తూ మాట్లాడుతున్నారు.

ఎస్పీ నేత ఆజంఖాన్ చేస్తున్న వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్, విహెచ్ పి లు తీవ్రంగా ఖండించాయి. ఆజంఖాన్ ను మతి చలించిందని అందుకే ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. గతంలో కూడా రేప్ బాధితురాలిని కేవలం పబ్లిసిటి కోసమే ఇలా రేప్ జరిగినట్లు వార్తల్లోకి వస్తున్నారని అన్నారు. దాంతో ఆ బాధితురాలు ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. దేశంలో అసహనం పెరిగిందని అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా.. అమీర్ మీద విమర్శల వర్షం కురిసింది. అయితే అమీర్ ఖాన్ కు అండగా ఆజంఖాన్ నిలిచారు. అమీర్ చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి తప్పులేదని అన్నారు. ఇలా ఎప్పుడు ఏదో ఒక వివాదంలో మునిగిపోవడం ఆజంఖాన్ కు అలవాటైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles